గోద్రా అల్లర్ల పరిహారం కేసు : మోదీకి భారీ ఊరట

గుజరాత్‌లోని సబర్కంతా దిగువ న్యాయస్థానం ఇవాళ నరేంద్రమోదీకి ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది. 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను‌ సదరు కోర్టు తోసిపుచ్చింది. గోద్రా అల్లర్లలో..

గోద్రా అల్లర్ల పరిహారం కేసు : మోదీకి భారీ ఊరట
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Sep 06, 2020 | 5:55 PM

గుజరాత్‌లోని సబర్కంతా దిగువ న్యాయస్థానం ఇవాళ నరేంద్రమోదీకి ఊరటనిచ్చే తీర్పు ఇచ్చింది. 2002 నాటి గోద్రా అల్లర్ల కేసులో నరేంద్ర మోదీ నుంచి తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ దాఖలైన పిటిషన్‌ను‌ సదరు కోర్టు తోసిపుచ్చింది. గోద్రా అల్లర్లలో నాటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రమేయం ఉందని నిరూపించడానికి ఎలాంటి సాక్ష్యాధారాలు లేవంది. ఫలితంగా ఈ వ్యాజ్యం నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఇలాఉండగా, అప్పటి అల్లర్ల సమయంలో ప్రత్యర్థి దాడిలో  మరణించిన ముగ్గురు ముస్లిం వ్యక్తుల తరఫున బ్రిటన్‌కు చెందిన బంధువుల కుటుంబం స్థానిక కోర్టులో 2004లో వ్యాజ్యం దాఖలు చేసింది. తమ కుటుంబ సభ్యుల మృతికి నాటి సీఎం నరేంద్ర మోదీనే కారణమని, ఆయన నుంచి 24 కోట్ల రూపాయలు నష్ట పరిహారం కావాలని పిటిషన్‌లో డిమాండ్‌ చేశారు. దీనిపై సుదీర్ఘ విచారణ చేసిన దిగువ కోర్టు.. నాటి అల్లర్లకు మోదీనే కారణమని చెప్పలేమని తాజా తీర్పులో పేర్కొంది. అంతేకాదు.. ఈ పిటిషన్‌ నుంచి ఆయన పేరును తొలగిస్తున్నట్లు ఆదివారం తీర్పుచెప్పింది