పోలీసుల తీరుపై మండిపడిన ఒకప్పటి ఫైర్‌బ్రాండ్‌

హాథ్రస్‌ ఘటనపై బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి స్పందించారు.. ఉత్తరప్రదేశ్‌ పోలీసుల తీరును ఖండించారు.. ఓ పెద్దక్కలా యోగీకి హితోక్తులు చెప్పారు.. యూపీ పోలీసుల ప్రవర్తన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బీజేపీకి కూడా మచ్చ తెచ్చిపెట్టిందని ఉమాభారతి అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని కలుసుకునే అవకాశాన్ని విపక్షాలకు, మీడియాకు కలిగించాలన్నారు. యోగి ప్రభుత్వానికి ట్విటర్‌లో ఉమాభారతి పలు సూచనలు చేశారు.. ‘ఓ దళిత అమ్మాయి అత్యాచారానికి గురైంది.. మృగాళ్ల చేతిలో చిత్రహింస అనుభవించి […]

పోలీసుల తీరుపై మండిపడిన ఒకప్పటి ఫైర్‌బ్రాండ్‌
Balu

|

Oct 03, 2020 | 12:18 PM

హాథ్రస్‌ ఘటనపై బీజేపీ సీనియర్‌ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ఉమాభారతి స్పందించారు.. ఉత్తరప్రదేశ్‌ పోలీసుల తీరును ఖండించారు.. ఓ పెద్దక్కలా యోగీకి హితోక్తులు చెప్పారు.. యూపీ పోలీసుల ప్రవర్తన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో పాటు బీజేపీకి కూడా మచ్చ తెచ్చిపెట్టిందని ఉమాభారతి అన్నారు. బాధితురాలి కుటుంబాన్ని కలుసుకునే అవకాశాన్ని విపక్షాలకు, మీడియాకు కలిగించాలన్నారు. యోగి ప్రభుత్వానికి ట్విటర్‌లో ఉమాభారతి పలు సూచనలు చేశారు.. ‘ఓ దళిత అమ్మాయి అత్యాచారానికి గురైంది.. మృగాళ్ల చేతిలో చిత్రహింస అనుభవించి ప్రాణాలు కోల్పోయింది.. ఆ అమ్మాయి తల్లిదండ్రులు.. బంధువులు ఎంతగా వేడుకున్నా పోలీసులు పట్టించుకోకుండా హడావుడిగా ఆమె అంత్యక్రియలు జరిపారు.. ఇప్పుడేమో ఆమె కుటుంబాన్ని ఎవరితో కలవనీయకుండా చేస్తున్నారు.. గ్రామంలో ఎవరిని అడుగుపెట్టనివ్వడం లేదు.. జరిగిన దారుణ ఘటనపై మీరు వెంటనే స్పందిస్తారని, నిందితులను కఠినంగా శిక్షిస్తారని అనుకున్నాను.. అందుకే ఇప్పటి వరకు మౌనంగా ఉన్నాను.. కానీ బాధితుల పట్ల పోలీసుల దుష్ప్రవర్తన ఆవేదన కలిగిస్తోంది.. సిట్‌ దర్యాప్తు జరుగుతున్నప్పుడు బాధిత కుటుంబం ఎవరితో కలవకూడదా? అలాంటి రూలేమన్నా ఉందా? ఇప్పుడు సిట్‌ దర్యాప్తుపై కూడా అందరికి అనుమానాలు వస్తున్నాయి.. రామాలయానికి శంకుస్థాపన చేసిన మనం రామరాజ్యం తీసుకొస్తామని ప్రజలకు చెప్పాం.. ఇప్పుడు హాథ్రస్‌లో పోలీసుల దౌర్జన్యం మీ ప్రభుత్వంతో పాటు బీజేపీకి కూడా మచ్చ తెస్తోంది’ అంటూ ట్విట్టర్‌లో ఉమాభారతి ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోసా సోకడం వల్ల హాస్పిటల్‌లో ఉంటున్నానని, లేకపోతే ఈపాటికి బాధిత కుటుంబాన్ని కలిసేదాన్ని అని ఉమాభారతి అన్నారు. డిశ్చార్జ్‌ అయిన వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శిస్తానని చెప్పారు. బీజేపీలో తాను మీ కంటే సీనియర్‌నని, అక్క లాంటి దాన్ని చెబుతున్నానని, తన విన్నపాలను, సూచనలు పరిగణనలోకి తీసుకోమని యోగిని అభ్యర్థించారు ఉమాభారతి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu