Corona Virus : దేశంలో కొత్తగా 79,476 కేసులు, 1,069 మరణాలు
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,32,675 వైరస్ టెస్టులు చేయగా, 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 11,32,675 వైరస్ టెస్టులు చేయగా, 79,476 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా ఇప్పటి వరకు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 64,73,545 కు చేరింది. వీరిలో 54,27,707 మంది వైరస్ బారి నుంచి రికవరీ అవ్వగా, మరో 9,44,996 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక కొత్తగా 1,069 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మరణాల సంఖ్య 1,00,842కు చేరింది. నిన్న ఒక్కరోజే కోవిడ్ నుంచి 75,628 మంది కోలుకున్నారు. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ, కోలుకునే వారి సంఖ్య కూడా పెరగడం ఊరటనిచ్చే విషయం. దేశవ్యాప్తంగా ప్రస్తుతం రికవరీ రేటు 83.84 శాతంగా, డెత్ రేటు 1.56 శాతంగా ఉంది.
ప్రస్తుతం మొత్తం పాజిటివ్ కేసుల్లో అమెరికా తర్వాత భారత్ రెండవ స్థానంలో కొనసాగుతోంది. రోజువారీ నమోదవుతున్న కరోనా కేసుల్లో ఇండియా ఫస్ట్ ప్లేసులో కొనసాగుతోంది. అలాగే… మొత్తం మరణాల్లో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్… మూడో స్థానంలో ఉంది. మన దేశంలో కరోనా వైరస్ కారణంగా చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. రోజువారీ నమోదవుతున్న కరోనా మరణాల్లో భారత్ ఫస్ట్ ప్లేసులో ఉంది.
Also Read :