కరోనా చికిత్సకు వెళ్లేముందు ట్రంప్ మాటలు
కరోనా నుంచి తాము త్వరగా కోలుకోవాలని అందరూ చూపిస్తున్న అద్భుతమైన మద్దతుకు ధన్యవాదాలు తెలియచేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాను, తన భార్య ఫస్ట్ లేడీ బాగానే ఉన్నామని భావిస్తున్నామని, చికిత్సకోసం వాల్టర్ రీడ్ హాస్పిటల్ కు వెళ్తున్నామని వెల్లడించారు. తమ ఆరోగ్యం పట్ల అందరూ చూపిస్తున్న ఆకాంక్షను ఎప్పటికీ మర్చిపోనని ట్రంప్ తన ట్విట్టర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాగా, శుక్రవారం కోవిడ్ నిర్ధారణ కాగానే ట్రంప్ దంపతులిద్దరూ క్వారంటైన్ కు వెళ్లారు. అయితే, […]
కరోనా నుంచి తాము త్వరగా కోలుకోవాలని అందరూ చూపిస్తున్న అద్భుతమైన మద్దతుకు ధన్యవాదాలు తెలియచేశారు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. తాను, తన భార్య ఫస్ట్ లేడీ బాగానే ఉన్నామని భావిస్తున్నామని, చికిత్సకోసం వాల్టర్ రీడ్ హాస్పిటల్ కు వెళ్తున్నామని వెల్లడించారు. తమ ఆరోగ్యం పట్ల అందరూ చూపిస్తున్న ఆకాంక్షను ఎప్పటికీ మర్చిపోనని ట్రంప్ తన ట్విట్టర్ వీడియో సందేశంలో పేర్కొన్నారు. కాగా, శుక్రవారం కోవిడ్ నిర్ధారణ కాగానే ట్రంప్ దంపతులిద్దరూ క్వారంటైన్ కు వెళ్లారు.
అయితే, 17 గంటల తర్వాత ట్రంప్ దంపతులు కొవిడ్ చికిత్సకోసం మేరీల్యాండ్ లోని బెథెస్డాలో ఉన్న వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ హాస్పిటల్ లో చేరారు. హాస్పిటల్ కు వెళ్లడానికి ఏర్పాటుచేసిన ప్రత్యేక హెలికాప్టర్ లో భార్యాభర్తలిద్దరూ ఆస్పత్రికి చేరుకున్నారు. హాస్పిటల్ కు తీసుకెళ్తున్న సమయంలో ట్రంప్.. ముఖానికి మాస్కుతో పాటు ప్రత్యేక మైన బిజినెస్ సూట్ ను ధరించారు. కరోనా తగ్గే వరకూ ట్రంప్.. మిలిటరీ హాస్పిటల్ నుంచే పనిచేస్తారని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. అందుకు తగిన ఏర్పాట్లన్నీ పూర్తయినట్టు సమాచారం.
— Donald J. Trump (@realDonaldTrump) October 2, 2020