AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Supreme Court: నీట్ పరీక్ష రద్దుపై ముగిసిన విచారణ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..

నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల, పలువురు రాజకీయ నాయకుల డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించింది సుప్రీం కోర్టు. ఆ విచారణ సందర్భంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని ధర్మాసనం నిర్ధారించింది.

Supreme Court: నీట్ పరీక్ష రద్దుపై ముగిసిన విచారణ.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు..
NEET-UG 2024 Controversy
Srikar T
|

Updated on: Jul 23, 2024 | 9:00 PM

Share

నీట్‌ పరీక్ష మళ్లీ నిర్వహించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్‌ అంశంపై విచారణ ముగియడంతో సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. నీట్‌ మళ్లీ నిర్వహించాలన్న విద్యార్థుల, పలువురు రాజకీయ నాయకుల డిమాండ్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకైన నేపథ్యంలో పిటిషన్ ను స్వీకరించింది సుప్రీం కోర్టు. ఆ విచారణ సందర్భంగా నీట్ యూజీ ప్రశ్నాపత్రం లీకైన మాట వాస్తవమేనని ధర్మాసనం నిర్ధారించింది. బీహార్‎లోని హజారీబాగ్, పాట్నాలోనూ పేపర్ లీకైందని తెలిపింది. 155 మంది విద్యార్థులు నీట్ పేపర్ లీక్‎తో లబ్ధి పొందారని సీజేఐ బెంచ్ వెల్లడించింది.

ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌, బిహార్‌లోని పట్నాలోని కేంద్రాల్లో నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీకైందన్న మాట వాస్తవమని సీబీఐ దర్యాప్తు సమాచారం ప్రకారం దాదాపు 155 మంది లబ్ధిపొందినట్లు తెలుస్తోందని ధర్మాసనం అభిప్రాయపడింది. పేపర్‌ లీకేజ్ ద్వారా లబ్ధిపొందిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని చెప్పేందుకు సరైన ఆధారాలు లేవని.. వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైందని నిర్ధారణకు రావడం ప్రస్తుత దశలో కష్టమని ధర్మాసనం అభిప్రాయ పడింది. మళ్లీ పరీక్ష పెడితే ఇప్పటి వరకూ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడతారని అభిప్రాయంపడింది. వారిలో అనేకమంది వందల కిలోమీటర్ల దూరం నుంచి ప్రయాణం చేసి పరీక్ష కేంద్రాలకు వెళ్లి నీట్ ఎగ్జామ్‌ రాసారని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తెలిపారు.

ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లోనీట్‌ ప్రవేశ పరీక్ష జరిగింది. దాదాపు 24 లక్షల మంది అభ్యర్థులు రాశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి 67 మంది విద్యార్ధులు 720కి 720 మార్కులు సాధించారు. హరియాణాలోని ఒకే పరీక్షా కేంద్రానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు తొలి ర్యాంక్‌ రావడంతో అనుమానాలు తలెత్తాయి. ఇంత మంది టాప్‌ ర్యాంకును పంచుకోవడం వెనుక గ్రేస్‌ మార్కులు కారణమని విద్యార్థులు ఆందోళనలు చేశారు. ఈ క్రమంలోనే ‘ఫిజిక్స్‌ వాలా’ విద్యాసంస్థ వ్యవస్థాపకుడు అలఖ్‌ పాండేతో పాటు మరి కొందరు నీట్ పేపర్‌ లీక్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
సిమెంట్, కాంక్రీట్ రెండూ ఒక్కటేనా? ఈ రెండింటిల్లో ఏది బెటర్..?
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు