Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే... రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు

అక్కడ ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే… రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు

Phani CH

|

Updated on: Jul 23, 2024 | 10:04 PM

కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్‌ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి, అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది.

కొంతమంది వాహనదారులు ఫాస్టాగ్‌లను వాహనం విండ్‌షీల్డ్‌పై బిగించడం లేదు. ఈ తరహా వాహనదారుల కారణంగా టోల్‌ గేట్ల వద్ద చెల్లింపుల విషయంలో ఇబ్బందులు తలెత్తి, అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి వాహనదారులను దారిలో పెట్టడమే లక్ష్యంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సరికొత్తగా సంపూర్ణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఉద్దేశపూర్వకంగా ఫాస్టాగ్‌ను బిగించని వాహనదారుల నుంచి రెట్టింపు టోల్ ఛార్జీలు వసూలు చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. విండ్‌స్క్రీన్‌పై ఫాస్టాగ్ బిగించకపోవడంతో టోల్ ప్లాజాల వద్ద అనవసరంగా ఆలస్యమవుతోందని, ఇతర వాహనదారులు అసౌకర్యానికి గురయ్యేందుకు దారితీస్తోందని పేర్కొంది. ఈ మేరకు రెట్టింపు ఛార్జీలు వసూలు చేయాలంటూ అన్ని యూజర్ ఫీజు కలెక్షన్ ఏజెన్సీలు, రాయితీదారులకు వివరణాత్మక ‘ప్రామాణిక నిర్వహణ ప్రక్రియ’ను జారీ చేసింది. దీంతో ఫాస్టాగ్‌లను సరిచేసుకోని వాహనదారులు రెట్టింపు టోల్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. విండ్‌షీల్డ్‌పై ఫాస్టాగ్ లేకుండా టోల్ లేన్‌లోకి ప్రవేశిస్తే విధించే ఛార్జీలపై ఫీజులతో కూడా బోర్డులు ప్రదర్శించాలని స్పష్టం చేసింది. ఇక ఫాస్టాగ్‌లు లేని వాహనాల వెహికల్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను సీసీటీవీ ఫుటేజీని రికార్డు చేయాలని సూచించింది. తద్వారా వాహనాలకు సంబంధించిన రికార్డులను నిర్వహించవచ్చునని పేర్కొంది. ప్రామాణిక ప్రక్రియ ప్రకారం ఫాస్టాగ్‌లను బిగించుకోకపోతే లావాదేవీల నిర్వహణకు అర్హత ఉండదని స్పష్టం చేసింది. అలాంటి వారు రెట్టింపు టోల్ రుసుమును చెల్లించాల్సి ఉంటుందని, వారిని బ్లాక్‌లిస్ట్‌లో చేర్చవచ్చునని పేర్కొంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు

DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి

రోజూ పరగడుపున ఒక్క గ్లాస్‌ ఈ జ్యూస్‌ తాగండి.. ఫలితం మీరే చూడండి!

ఈ లక్షణాలను లైట్‌ తీసుకోకండి.. పెనుప్రమాదం జరగవచ్చు

సినీ ప్రియులకు షాక్‌.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను