DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి
రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయే ప్రయత్నంలో చాలా మంది ఉండటం చూస్తున్నాం. రీల్స్‌తో పాపులరై డబ్బులూ వెనకేయొచ్చని భావించిన ఓ పనిమనిషి డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనేందుకు పనిచేస్తున్న ఇంట్లోనే లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు దొంగిలించింది. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. ఢిల్లీలోని రాజ్‌పురాలో జరిగిందీ ఘటన.ద్వారకలోని ఓ ఇంట్లో ఈ నెల 15న పనిమనిషిగా చేరిన నీతూ యజమానుల నమ్మకాన్ని సంపాదించింది.
రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయే ప్రయత్నంలో చాలా మంది ఉండటం చూస్తున్నాం. రీల్స్‌తో పాపులరై డబ్బులూ వెనకేయొచ్చని భావించిన ఓ పనిమనిషి డీఎస్ఎల్ఆర్ కెమెరా కొనేందుకు పనిచేస్తున్న ఇంట్లోనే లక్షల రూపాయల విలువ చేసే బంగారు నగలు దొంగిలించింది. ఇప్పుడు తీరిగ్గా కటకటాలు లెక్కపెట్టుకుంటోంది. ఢిల్లీలోని రాజ్‌పురాలో జరిగిందీ ఘటన.ద్వారకలోని ఓ ఇంట్లో ఈ నెల 15న పనిమనిషిగా చేరిన నీతూ యజమానుల నమ్మకాన్ని సంపాదించింది. పనిలో చేరేటప్పుడు తన వివరాలకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చింది. రీల్స్ చేస్తూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌గా మారిపోవాలని భావించిన నీతూ అదును చూసి రెండు బంగారు గాజులు, వెండిగొలుసు, కాళ్ల పట్టీలు దొంగిలించి పరారైంది. ఆ పై తన సెల్‌ఫోన్‌ను ఆఫ్ చేసుకుంది. లొకేషన్ గుర్తించకుండా పలు ఆటోలు మారింది. ఇంట్లో నగలు పోయిన విషయాన్ని గుర్తించిన యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు రాజ్‌పురి చౌక్‌లో ఆమెను అరెస్ట్ చేశారు. ఢిల్లీని విడిచిపెట్టి వెళ్లేందుకు బ్యాగేజీతో సిద్ధమైన ఆమె నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ పరగడుపున ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!
ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. పెనుప్రమాదం జరగవచ్చు
సినీ ప్రియులకు షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

