Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సొంత రామాయణం రాస్తాడేమో.. సోను సూద్ ట్వీట్‌పై కంగన సీరియస్

సొంత రామాయణం రాస్తాడేమో.. సోను సూద్ ట్వీట్‌పై కంగన సీరియస్

Phani CH

|

Updated on: Jul 23, 2024 | 9:48 PM

నిన్న మొన్నటి వరకు సేవా కార్యక్రమాలతో నెట్టింట వైరల్ అయిన సోనూ సూద్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు. తాను చేసిన ఓ ట్వీట్‌ కారణంగా..! ఆ ట్వీట్లో శబరి ఎంగిలి తిన్న రాముడి సీన్‌ను మరోలా చెప్పడం మూలానా.. ! ఇప్పుడు ఓ వర్గం నెటిజన్స్‌కు ఆయన టార్గెట్ అయ్యారు. అందులోనూ బీజేపీ నేత కంగనకు విపరీతంగా కోపం వచ్చేలా చేసుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! రీసెంట్గా తాండూరులో ఒక ముస్లిం వ్యక్తి..

నిన్న మొన్నటి వరకు సేవా కార్యక్రమాలతో నెట్టింట వైరల్ అయిన సోనూ సూద్ ఇప్పుడు ట్రోల్ అవుతున్నారు. తాను చేసిన ఓ ట్వీట్‌ కారణంగా..! ఆ ట్వీట్లో శబరి ఎంగిలి తిన్న రాముడి సీన్‌ను మరోలా చెప్పడం మూలానా.. ! ఇప్పుడు ఓ వర్గం నెటిజన్స్‌కు ఆయన టార్గెట్ అయ్యారు. అందులోనూ బీజేపీ నేత కంగనకు విపరీతంగా కోపం వచ్చేలా చేసుకున్నారు. ఇక అసలు విషయం ఏంటంటే..! రీసెంట్గా తాండూరులో ఒక ముస్లిం వ్యక్తి.. తన హోటల్లో రోటీ తయారు చేస్తూ దానిపై ఉమ్మి వేశాడు. ఆ వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అయితే ఆ వీడియోను షేర్ చేసిన సోనూ సూద్.. ఆ వీడియోలోని వ్యక్తిని శబరి తో పోల్చాడు. శబరి రాముడి మిగిల్చిన పండును తింది.. హింసను ఓడించడానికి తాను ఈ సోదరుడు ఎంగిలి రోటీని ఎందుకు తినను…! అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు మానవత్వం సర్వత్రా వ్యాపింపజేయాలని అన్నారు. అయితే సోను సూద్ చేసిన ఈ ట్వీట్‌పై ఓ వర్గం వారు సీరియస్ అవుతున్నారు. షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన బీజేపీ ఎంపీ కంగన.. ఈయనపై సెటైరికల్ అండ్ ఫైరింగ్ కామెంట్స్ చేశారు. సోనూసూద్ తన స్వంత ఆవిష్కరణ ద్వారా రామాయణం కొత్త కథను వ్రాసి దర్శకత్వం వహిస్తాడేమో… బాలీవుడ్‌లో కొత్త రామాయణం సినిమా తీస్తాడేమో అంటూ ట్వీట్ చేశారు. సోను సూద్ ట్వీట్‌కు తానిచ్చిన ఈ రియాక్షన్ ట్వీట్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ బ్యూటీ.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాటర్‌ హీటర్‌ నీళ్లతో స్నానం చేస్తున్నారా ?? ఈ విషయాలు తెలిస్తే షాకే !!

అమెజాన్ లోని అరుదైన తెగను తరిమేశారా ??

ఈ మొక్క ఎక్కడ కనిపించినా వదలకండి.. లాభాలు తెలిస్తే షాకవుతారు

‘శుభమా అని పెళ్లి చేసుకుంటే.. వీడెవడు మధ్యలో..’

చిన్నారులకు.. గోల్డెన్ ఛాన్స్.. ప్రభాస్ టీం బంపర్ ఆఫర్