యువతి తలలోకి 70 సూదులు దింపిన మాంత్రికుడు
అనారోగ్యంతో ఉన్న యువతి తలలో చికిత్స పేరిట 70 సూదులు దింపిన మాంత్రికుడి ఉదంతం ప్రస్తుతం ఒడిశాలో చర్చనీయాంశంగా మారింది. సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. బొలంగీర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్‌గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల రేష్మా బెహారా మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది.
అనారోగ్యంతో ఉన్న యువతి తలలో చికిత్స పేరిట 70 సూదులు దింపిన మాంత్రికుడి ఉదంతం ప్రస్తుతం ఒడిశాలో చర్చనీయాంశంగా మారింది. సూదులు పుర్రెను దాటి మెదడు దాకా వెళ్లకపోవడంతో యువతికి ప్రాణాపాయం తప్పింది. బొలంగీర్ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, స్థానిక సింథికేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇచ్‌గావ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల రేష్మా బెహారా మూడేళ్ల క్రితం అనారోగ్యం బారిన పడింది. దీంతో, ఆమె తండ్రి బిష్ణు బెహారా.. తేజ్‌రాజ్ రాణా అనే మాంత్రికుడిని సంప్రదించారు. వైద్యం పేరిట తేజ్‌రాజ్ పలు దఫాలుగా రేష్మా తలలోకి 70 సూదులను గుచ్చాడు. ఇటీవల తీవ్రమైన తలనొప్పితో బాధపడుతున్న యువతిని కుటుంబ సభ్యులు వింసార్ ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం వైద్యులు ఆమెకు సిటీ స్కానింగ్ చేసి నిర్ఘాంతపోయారు. ఆమె పుర్రెపై సూదులు ఉన్నట్టు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేశారు. దాదాపు గంటన్నర పాటు శ్రమించి యువతి తలలోని 70 సూదులను బయటకు తీశారు. పుర్రె ఎముకపై ఉన్న సూదులు లోపలికి వెళ్లకపోవడంతో ఆమె ప్రాణాలతో బయటపడిందని వింసార్‌కు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ రబినారాయణ్ గురు తెలిపారు. పోలీసులు మాంత్రికుడు తేజ్‌రాజ్‌ను అరెస్టు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
DSLR కెమెరా కోసం బంగారు నగలను చోరీ చేసిన పనిమనిషి
రోజూ పరగడుపున ఒక్క గ్లాస్ ఈ జ్యూస్ తాగండి.. ఫలితం మీరే చూడండి!
ఈ లక్షణాలను లైట్ తీసుకోకండి.. పెనుప్రమాదం జరగవచ్చు
సినీ ప్రియులకు షాక్.. టికెట్లు, ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌పై పన్ను