AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanwar Yatra: ‘కన్వర్ యాత్ర’పై పునరాలోచించండి.. యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం..

Supreme Court on Kanwar Yatra: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌,

Kanwar Yatra: 'కన్వర్ యాత్ర'పై పునరాలోచించండి.. యూపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం..
Kanwar Yatra
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2021 | 4:00 PM

Share

Supreme Court on Kanwar Yatra: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ క్రమంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్‌, హర్యానా రాష్ట్రాల్లో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న కన్వర్ యాత్రపై ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఈ యాత్రను ఇప్పటికే రద్దు చేస్తున్నట్లు ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ప్రకటించింది. హరిద్వార్‌కు భక్తులకు అనుమతి లేదని.. ఒకవేళ వస్తే క్వారంటైన్‌కు తరలిస్తామని తెలిపింది. ఇంకా దీనిపై యూపీ, పలు రాష్ట్రాలు స్పందించాల్సి ఉంది. దీనిపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కన్వర్ యాత్రను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాలను ఆదేశాలిచ్చింది. భక్తులు హరిద్వార్ నుంచి గంగాజలాన్ని తీసుకురావడాన్ని అనుమతించొద్దంటూ ఆదేశాల్లో తెలిపింది. దీనిపై పునరాలోచించాలని.. లేకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. నిర్దేశిత ప్రాంతాల్లో శివాభిషేకాలకు గంగా జలాన్ని ట్యాంకర్ల ద్వారా ఏర్పాటు చేయాలని సూచించింది. జీవించే హక్కు కంటే మత విశ్వాసాలు ముఖ్యం కాదంటూ ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.

ఇదిలా ఉంటే.. కన్వర్ యాత్రపై శుక్రవారం కేంద్రం.. సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. హరిద్వార్ నుంచి గంగాజలం తీసుకురావడానికి యాత్రికులకు అనుమతి ఇవ్వొద్దని రాష్ట్రాలకు సూచించినట్టు తెలిపింది. అయితే మత విశ్వాసాలను అనుసరించి ట్యాంకర్ల ద్వారా గంగాజలం అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేయాలని.. ఆయా రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రం తెలిపింది. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొంది. గంగాజలం భక్తులకు అందుబాటులో ఉండేలా చూస్తున్నామని సుప్రీం కోర్టుకు తెలియజేసింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ గంగాజలం పంపిణీ చేపట్టాలని.. ఆయా రాష్ట్రాలకు సూచించినట్టు కేంద్రప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెల్లడించింది. కాగా.. ఉత్తరాదిన శ్రావణ మాసంలో నిర్వహించే కన్వర్ యాత్రలో భాగంగా శివ భక్తులు గంగా నది నీటిని తీసుకొని వెళ్లి భగవంతుడికి జలాభిషేకం చేస్తారు.

Also Read:

కేక్‌ తెచ్చిన తంటా.. నేరస్థుడికి తినిపించి అడ్డంగా బుక్కైన ఇన్స్‌పెక్టర్‌.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

Amrita Sher-Gil: ఆ చిత్రకారిణి మరణం ఇప్పటికీ మిస్టరీనే.. ఆమె వేసిన పెయింటింగ్ వేలం.. రికార్డ్ ధర పలికిన వైనం

Follow Us
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
బెల్లం పానకంపై బొమ్మలు గీస్తూ.. రూ.62 లక్షలు దోచుకున్నారు..
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
నెటిజన్లను కన్నీళ్లు పెట్టిస్తున్న జొమాటో ‘ఉమా’ రియల్ స్టోరీ!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
అమెరికాలో కూతురి పెళ్లి... ఆన్‌లైన్‌లో అక్షింతలు..!
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
ప్రజావాణితో వెలిగిన రైతు జీవితం..25 ఏళ్ల కల నెరవేరి.. బీడు భూమిలో
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
కోట్లు ఖర్చు పెట్టినా తగ్గని రోగాలను చిటికెలో మాయం చేసే నేచురల్ మ
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
తుమ్మిడిహెట్టిపై తెలంగాణ మాస్టర్ ప్లాన్..!
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
వెండి కొనబోతున్నారా? మీకో గుడ్‌న్యూస్‌..భారీగా తగ్గిన సిల్వర్‌ ధర
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
చేతబడి అనుమానాలు, పాత కక్షలతో దారుణం..!
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
సర్పానికి సర్జరీ చేసి ప్రాణం పోశారు.. నాగ జెర్రీ గురించి తెలుసా..
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?
క్రికెట్ వదిలి పైలెట్‌గా మారిన ప్లేయర్.. ఎవరో తెలుసా?