Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ ధరల విషయంలో కేంద్రం పునఃసమీక్షించాలి..కేంద్రానికి ఓ రేటు.. రాష్ట్రాలకు ఓ రేటు సరికాదు!

కరోనా కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కరోనాను ఎదుర్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ఇంకా తగినంత ప్రజలకు చేరే అవకాశం కనిపించడం లేదు.

Vaccination: కోవిడ్ వ్యాక్సిన్ ధరల విషయంలో కేంద్రం పునఃసమీక్షించాలి..కేంద్రానికి ఓ రేటు.. రాష్ట్రాలకు ఓ రేటు సరికాదు!
Vaccine
Follow us

|

Updated on: May 04, 2021 | 7:52 AM

Vaccination:  కరోనా కల్లోలం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కరోనాను ఎదుర్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, ఇంకా తగినంత ప్రజలకు చేరే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో వ్యాక్సిన్ కంపెనీలు కూడా ఇటీవల ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఇది మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు అయింది. కోవిడ్ టీకాల ధరలు కంపెనీలు పెంచేయడం.. స్టాక్ లేకపోవడం ప్రస్తుతం వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఇబ్బందికరంగా మారింది. ఒక పక్క కరోనా కేసులు పెరిగిపోతుండటం.. మరోపక్క ఆశించినంత వేగంగా వ్యాక్సినేషన్ జరగకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ సమయంలో కరోనా టీకా ధరలపై సుప్రీంకోర్టు స్పందించింది.

దేశంలో కరోనా వ్యాక్సిన్‌ ధరల విధానాన్ని పునఃసమీక్షించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. వ్యాక్సిన్‌ ధరల విధానం ప్రజల ఆరోగ్య హక్కుకు హాని కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. కేంద్రానికి తక్కువ ధర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎక్కువ ధర వర్తించేలా టీకా తయారీదారులు రెండు వేర్వేరు ధరలు సూచించారని జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక స్తోమత ఆధారంగా టీకా ఉచితంగా అందుబాటులో ఉంచాలా? వద్దా? అనేది ఆధారపడి ఉంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలా ఆధారపడితే అది దేశవ్యాప్తంగా అసమానతలు సృష్టిస్తుందన్న ధర్మాసనం.. పౌరులకు అందించే టీకాలు విలువైన ప్రజాప్రయోజనాన్ని కలిగిస్తాయని వ్యాఖ్యానించింది. బలహీనవర్గాలు, అట్టడుగు వర్గాలకు చెందిన వ్యక్తులకు టీకా కొనుగోలు చేసే సామర్థ్యం లేకపోవచ్చని పేర్కొంది. 18 నుంచి 44 ఏళ్ల వయసు గలవారికి వ్యాక్సిన్‌ను అందించేందుకు.. టీకా తయారీదారులతో రాష్ట్ర ప్రభుత్వాలు చర్చలు జరపవచ్చని సూచించింది.

ఇప్పుడు సుప్రీంకోర్టు సూచనల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ధరల విషయంలో మరోమారు పరిశీలన జరిపే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అలా అయితే, వ్యాక్సిన్ ధరలు తగ్గడం కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఒకే ధర ఉండేలా చూడటం కానీ, జరగవచ్చని చెబుతున్నారు. ఇలా జరిగితే టీకా కోసం ఎదురు చూస్తున్న కోట్లాదిమంది ప్రజలకు ఊరట లభించినట్టే.

ఇదిలా ఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి దేశంలో రికార్డు స్థాయిలో ఉంది.  దేశంలో కరోనా రోగుల సంఖ్య 2 కోట్లు దాటింది. 20 మిలియన్లకు పైగా ప్రజలు సోకిన రెండవ దేశంగా భారతదేశం చేరింది.

Also Read: AP Corona cases: ఏపీలో ఏమాత్రం తగ్గని కరోనా తీవ్రత… 10వేలకు పైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా 71 మంది మృతి

Covid-19: పది రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం.. యువతిని పొట్టనబెట్టుకున్న కరోనా..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..