Karnataka: బరితెగించిన విద్యార్థులు.. పాఠాలు చెప్పేందుకు వచ్చిన టీచర్‌ని టీజ్ చేస్తూ.. నెత్తిమీద చెత్త బుట్ట..
Karnataka: తల్లిదండ్రుల తర్వాత స్థానం ఆచార్యదేవోభవ అంటూ గురువుకు అత్యుతన్న స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. విద్యాబుద్ధు నేర్పి.. సమాజంలో ఒక..
Karnataka: తల్లిదండ్రుల తర్వాత స్థానం ఆచార్యదేవోభవ అంటూ గురువుకు అత్యుతన్న స్థానం ఇచ్చిన సంస్కృతి మనది. విద్యాబుద్ధు నేర్పి.. సమాజంలో ఒక ప్రయోజకుడైన పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దే గురువుని గౌరవిస్తాం.. పూజిస్తాం.. అయితే నేటి సమాజంలో వచ్చిన అనేక మార్పుల్లో ఒకటి.. చదువు చెప్పే ఉపాధ్యాయుడిని ఎగతాళి చేయడం.. కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం.. అయితే ఇప్పుడు ఏకంగా కొందరు విద్యార్థులు చదువు చెప్పడానికి క్లాస్ రూమ్ లోకి వచ్చిన ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సభ్యసమాజం సిగ్గుపడేలా జరిగిన ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. కర్ణాటకలోని దావణగెరెలోని ఓ పాఠశాలలో టీచర్‌పై విద్యార్థులు దాడి చేశారు. ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడి చేసిన వీడియో వైరల్‌గా మారి విద్యాశాఖ మంత్రికి చేరుకుంది. వివరాల్లోకి వెళ్తే..
దావణగేరె జిల్లా చిన్నగిరి తాలూకా నల్లూర్ హై స్కూల్ లో ఈ దారుణ ఘటన జరిగింది. ఒక హిందీ టీచర్ క్లాస్‌రూమ్‌లోకి వచ్చినప్పుడు విద్యార్థులు అతనితో అసభ్యంగా ప్రవర్తించినట్లు వీడియో ద్వారా తెలుస్తోంది. అంతేకాదు విద్యార్థుల్లో ఒకరు డస్ట్‌బిన్‌తో ఉపాధ్యాయుడిపై దాడి చేసేందుకు ప్రయత్నించాడు. అనంతరం ఆ టీచర్ పాఠం చెప్పడం కోసం బోర్డు వైపు తిరిగి పాఠం చెప్పడం ప్రారంభించినప్పుడు ఆ స్టూడెంట్ డస్ట్ బిన్ ను ఉపాధ్యాయుని తలపై పెట్టాడు. ఈ సమయంలో ఎవరో ఈ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
కర్ణాటక విద్యాశాఖ మంత్రి బిసి నగేష్ దృష్టికి ఈ ఘటన వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి సంబంధితం స్టూడెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు ఎవరు చేసినా సహించేది లేదని మంత్రి ట్విట్ చేశారు. ఈ విషయంపై విద్యాశాఖ, పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: మంచు కురిసే వేళలో బోట్ రైడింగ్. యజమానితో పాటు ఎంజాయ్ చేస్తోన్న కుక్క..