AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Riding Boat: మంచు కురిసే వేళలో బోట్‌ రైడింగ్‌. యజమానితో పాటు ఎంజాయ్ చేస్తోన్న కుక్క..

Dog Riding Boat: పైనుంచి మంచు వర్షం కురుస్తుంటే.. సరదాగా నడవమే గొప్ప అనుభూతినిస్తుందంటే .. ఇక మంచు కురిసే వేళల్లో నదిలో..

Dog Riding Boat: మంచు కురిసే వేళలో బోట్‌ రైడింగ్‌. యజమానితో పాటు ఎంజాయ్ చేస్తోన్న కుక్క..
Dog Riding Boat
Surya Kala
|

Updated on: Dec 11, 2021 | 6:42 PM

Share

Dog Riding Boat: పైనుంచి మంచు వర్షం కురుస్తుంటే.. సరదాగా నడవమే గొప్ప అనుభూతినిస్తుందంటే .. ఇక మంచు కురిసే వేళల్లో నదిలో పడవలో బోటింగ్‌కు వెళ్తే ఎలా ఉంటుంది… ఊహకు అందని భావాలు మదిలో కదలాడుతున్నాయి కదా.. మంచు కురిసే సీజన్..  క్రిస్మస్ సీజన్.. రెండిటి విదేశియులు ఎంజాయ్ చేస్తుంటారు. మంచు వర్షంలా కురుస్తున్న సమయంలో రోడ్లు, ఇళ్లు, చెట్లు, వాహనాలు అంతా మంచుతో నిండిపోతాయి. శ్వేతవర్ణ అడ్డుకున్న ప్రపంచం కనిపిస్తుంది. ఆ సమయంలో ఆకాశం మబ్బులతో నిండిపోయి… అదొక అందమైన లోకంలా ఉంటుంది. అలా మంచు కురుస్తున్నప్పుడు బయట తిరగటానికి బాగా ఇష్టపడతారు చాలామంది. ఎటు చూసినా ఫ్రెష్ మంచు కనిపిస్తూ… ఆ దృశ్యం అత్యద్భుతంగా ఉంటుంది.

తాజాగా ఓ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో మంచు బాగా కురుస్తున్న టైంలో… నదిలో బోట్ రైడింగ్ చేస్తున్నాడు ఓ వ్యక్తి. పడవలో ఓ వైపు ఓ కుక్క కూడా కూర్చొని ఉంది. ఈ వీడియోలో మరో ప్రత్యేకమైన విషయం ఏంటంటే అతను తన కుక్క పక్కన ఓ చిన్న లాంతరు దీపాన్ని వెలిగించి ఉంచాడు. బహుశా ఆ కుక్కకు వేడి కోసం అలా చేసి ఉండొచ్చు. అతను అలా గడ్డకట్టిన మంచులో పడవలో వెళ్తుంటే… ఆ దృశ్యం నయనమనోహరంగా ఉంది. డిసెంబర్ 6న పోస్ట్ చేసిన ఈ వీడియోని వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు బాగా లైక్‌ చేస్తున్నారు. లొకేషన్ , “మంచు కురిసే దృశ్యం చాలా బాగుందంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియోలోని ఫ్రిట్జ్‌ అనే వ్యక్తి తరచూ అడవుల్లో తిరుగుతూ ఉంటాడు. అడవుల వీడియోలను ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్‌లలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. క్రిస్మస్ రాకముందే మంచు వచ్చేసింది కాబట్టి… నెటిజన్లు అడ్వాన్స్‌గా క్రిస్మస్ శుభాకాంక్షలు చెబుతున్నారు.ఈ వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లోని old.time.hawkey అనే ఖాతాలో పోస్ట్ చేశారు.

Also Read:  కాశీ విశ్వనాథ్ కారిడార్‌ని ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. సరికొత్త అందాలతో వారణాసి కనులవిందు..