Crime: విద్యార్థిపై ముగ్గురు టీచర్ల కర్కశత్వం.. రూమ్ లో పడేసి మరీ దారుణం.. చివరకు
విద్యార్థులు చేసిన తప్పులను మన్నించి, వారిలో క్రమశిక్షణ కలిగించాల్సిన ఉపాధ్యాయులే (Teachers) ఓ స్టూడెంట్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు టీచర్లు విద్యార్థిని దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పూ...
విద్యార్థులు చేసిన తప్పులను మన్నించి, వారిలో క్రమశిక్షణ కలిగించాల్సిన ఉపాధ్యాయులే (Teachers) ఓ స్టూడెంట్ పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు టీచర్లు విద్యార్థిని దారుణంగా కొట్టారు. తాను ఏ తప్పూ చేయలేదని చెబుతున్నా వినిపించుకోకుండా కర్కశత్వంగా ప్రవర్తించారు. వాచీ దొంగిలించాడన్న నెపంతో రూమ్ లో పెట్టి విచక్షణ మరిచిపోయి వ్యవహరించారు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం కలిగించింది. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) లోని ఛిబరమవు కొత్వాలి కసవ గ్రామంలో జహంగీర్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతడి 15 ఏళ్ల కుమారుడు దిల్షాన్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. కాగా.. లంచ్ బ్రేక్ సమయంలో స్కూల్ హెడ్ మాస్టర్ దిల్షాన్ ను తన రూమ్ కు పిలిచారు. దిల్షాన్ గదిలోకి వెళ్లగానే తలుపులు మూసేశారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ఉపాధ్యాయులు ప్రభాకర్, వివేక్ లు దిల్షాన్ వద్దకు వచ్చారు. వాచీ దొంగతనం చేశావంటూ దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, బంధువులు పాఠశాలకు చేరుకున్నారు. తీవ్ర గాయాలతో పడి ఉన్న దిల్షాన్ ను తీసుకుని చికిత్స కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్యం విషమించడంతో పై ఆస్పత్రికి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. దీంతో కాన్పుర్ లోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ దిల్షాన్ మృతి చెందాడు. ఈ ఘటనపై బాలుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కుమారుడు వాచీ దొంగలించాడనే నెపంతో దారుణంగా కొట్టారని, కానీ ఆ వాచీని మరొకరు అతడి బ్యాగులో పెట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అందరితో చలాకీగా ఉండే దిల్షాన్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి