Meghalaya: వ్యభిచారం కేసులో మేఘాలయ బీజేపీ నాయకుడు అరెస్టు..!  ఫాంహౌస్‌లో గుట్టు చప్పుడుకాకుండా..

వ్యభిచారం కేసులో మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మారక్‌ను పోలీసులు మంగళవారం (జులై 26) అరెస్టు చేశారు..

Meghalaya: వ్యభిచారం కేసులో మేఘాలయ బీజేపీ నాయకుడు అరెస్టు..!  ఫాంహౌస్‌లో గుట్టు చప్పుడుకాకుండా..
Bernard Marak
Follow us

|

Updated on: Jul 27, 2022 | 9:26 PM

Meghalaya BJP leader arrested by police: మేఘాలయ బీజేపీ నాయకుడు బెర్నార్డ్ మారక్‌ను పోలీసులు మంగళవారం (జులై 26) అరెస్టు చేశారు. వెస్ట్ గారోహిల్స్ జిల్లాలోని తురా పట్టణంలోనున్న బెర్నార్డ్ మారక్‌ ఫాంహౌస్‌లో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందడంతో జులై 23న స్పెషల్ ఆపరేషన్ బృందం దాడి చేసింది. దీంతో అక్కడి నుంచి బెర్నార్డ్ పరారయ్యి ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్‌లో తలదాచుకున్నాడు. ఐతే పోలీసులు వ్యూహం ప్రకారం అతని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి, మేఘాలయ పోలీసులకు అప్పిగించినట్టు హాపూర్ పోలీసు అధికారి తెలిపారు. ఈ దాడుల్లో దాదాపు 400 మద్యం సీసాలు, 500లకు పైగా కండోమ్‌లను, 27 వాహనాలు, 8 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు.

పశ్చిమ గారో హిల్స్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) వివేకానంద సింగ్ మాట్లాడుతూ.. పక్కా సమాచారం ఆధారంగా మారక్ ఫామ్‌హౌస్‌పై దాడులు నిర్వహించాము. దాడిలో ఆరుగురు మైనర్లను రక్షించాము. వీరిని మేఘాలయ బీజేపీ ఉపాధ్యక్షుడు బెర్నార్డ్ మారక్, అతని సహచరులతో రింపు బగన్‌లోని మురికి వాడల్లో బంధించినట్లు తెలిసింది. మైనర్లను విడిపించి పునరావాస కేంద్రానికి తరలించాము. ఈ వ్యభిచార దందాతో సంబంధమున్న 73 మందిని అరెస్టు చేశాం. కోర్టు బెర్నార్డ్ మారక్‌కు నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసింది. దోషులను విచారించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీడియాకు ఎస్పీ వివేకానంద సింగ్ తెలిపారు.