Viral: గ్లాసు ఎక్కడికి చొచ్చుకెళ్లిందో తెలిస్తే స్టన్ అవుతారు.. డాక్టర్లు ఏం చేశారంటే…?
బాధితుడికి మతిస్థిమితం సరిగా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే, అతడు తమతో మాములుగానే ప్రవర్తించాడని డాక్టర్లు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Bihar: బిహార్‌లోని నవాదా జిల్లా(Nawada District)లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఓ వ్యక్తి మలద్వారంలోకి.. స్టీల్ గ్లాస్ చొచ్చుకెళ్లింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే ఫ్యామిలీ మెంబర్స్ అతడిని పాట్నా(Patna)లోని పీఎంసీహెచ్ ఆస్పత్రికి తరలించారు. తొలుత కేసు వివరాలు తెలుసుకుని డాక్టర్లు స్టన్ అయ్యారు. ఆపై పరీక్షలు చేసిన డాక్టర్లు.. మలద్వారం నుంచి గ్లాసును వెనక్కి తీయడం సాధ్యం కాదని నిర్ధారించుకున్నారు. ఎక్స్‌రే ద్వారా స్టీల్ గ్లాసు.. బాధితుడి మలద్వారంలో చాలా లోతుకు వెళ్లిందని గుర్తించారు. ఆపై డాక్టర్ వినయ్ కుమార్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల వైద్య బృందం విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించింది. పొట్టకు ఆపరేషన్ నిర్వహించి గ్లాసును బయటకు తీశారు డాక్టర్లు. ఆపరేషన్ పూర్తైన తర్వాత బాధితుడిని అబ్జర్వేషన్‌లో ఉంచారు. అతడి పరిస్థితి బాగానే ఉండటంతో కొద్ది గంటల తర్వాత జనరల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. గ్లాసు అతడి రహస్య భాగంలోకి ఎలా వెళ్లిందన్న విషయంపై డాక్టర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధితుడికి మతిస్థిమితం సరిగా లేదని బంధువులు చెబుతున్నప్పటికీ.. అతడు తమతో మాములు వ్యక్తిలానే ప్రవర్తించాడని వైద్యులు తెలిపారు. స్టీల్ గ్లాసును బోర్లా వేసి.. దానిపై కూర్చున్నట్టు అతడు చెప్పినట్లు వెల్లడించారు. వైద్యులు ఈ విషయంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తాంత్రిక పూజలను సాధన చేసేందుకే అతను గ్లాస్‌పై కూర్చొని ఉంటాడని అనుమానిస్తున్నారు.
మరిన్ని జాతీయవార్తల కోసం క్లిక్ చేయండి..




