ఆహా.. జమ్మూకాశ్మీర్‌లో ఎంత మార్పు.. శ్రీనగర్‌లోని లాల్ చౌక్ త్రివర్ణ శోభితం.. వీడియో
Srinagar's Lal Chowk: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదాన్ని
Srinagar’s Lal Chowk: జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేసిన రెండేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ఈ తరుణంలో ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో రూపుమాపేందుకు ప్రభుత్వం సైతం చర్యలు తీసుకుంటోంది. దీంతోపాటు కాశ్మీర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలు అమలయ్యేలా సన్నాహాలు కూడా ప్రారంభించింది. అయితే.. ఎల్లప్పుడు బాంబులతో దద్దరిల్లిన ప్రాంతాల్లో.. ప్రస్తుతం కొంతమేర ప్రశాంత వాతావరణం కనిపిస్తోంది. అక్కడక్కడ ఉగ్రవాదం జడలు విప్పుతున్నప్పటికీ.. ఎలాంటి దాడులు జరగకుండా భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. అయితే.. తాజా పరిస్థితులకు అద్దం పట్టేలా శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్ నిలిచింది. ఒకప్పుడు ఉగ్రవాదులు, వేర్పాటువాదులకు నీడలా ఉన్న ఈ ప్రాంతంలో త్రివర్ణం రెపరెపలాడుతోంది. తుపాకులు, బాంబుల మోతలతో.. నీరసనకు వేదికగా ఉన్న ఈ ప్రాంతంలో త్రీవర్ణం శోభయామానంగా ప్రకాశిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
వైరల్ వీడియో..
#WATCH | Jammu and Kashmir: Clock Tower (‘Ghanta Ghar’) at Lal Chowk in Srinagar illuminated in the colours of the Tricolour last night, ahead of Independence Day. pic.twitter.com/6d2pbbX2i3
— ANI (@ANI) August 7, 2021
కాగా.. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు శ్రీనగర్‌లోని ఐకానిక్ క్లాక్ టవర్‌ను త్రివర్ణ దీపాలతో అలంకరించారు. రాత్రివేళ రంగు రంగుల విద్యుద్దీపాల మధ్య.. త్రివర్ణం ప్రకాశవంతంగా మిరుమిట్లుగొలిపేలా ఏర్పాట్లు చేశారు. ఈ క్లాక్ టవర్ చిత్రాలను శ్రీనగర్ మేయర్ జునైద్ మట్టు ట్విట్ చేస్తూ.. కొత్త గడియారాలను సైతం అమర్చినట్లు తెలియజేశారు. కాగా ఇలాంటి దృశ్యం మొట్టమొదటిసారిగా ఆవిష్క్రతమైందని పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
We have illuminated the Clock Tower (‘Ghanta Ghar’) at Lal Chowk in colours of the Tricolour ahead of Independence Day. ??
New clocks fitted.
Well done Team @SMC_Srinagar! pic.twitter.com/EKeFZX957o
— Mayor of Srinagar (@MayorofS) August 6, 2021
ఇదిలాఉంటే.. పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) ఆగస్టులో కాశ్మీర్, లడఖ్‌లో ఐదు రోజుల పర్యటించనుందని కేంద్ర అధికార వర్గాలు శుక్రవారం వెల్లడిచాయి. పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత.. అధిర్ రంజన్ చౌదరి అధ్యక్షతన పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఆగస్టు 14 నుంచి 18 వరకు కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో పర్యటించనుంది. ఈ సందర్భంగా వారు కాశ్మీర్‌లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులను, అభివృద్ధి తదితర అంశాలపై స్థానికులను అడిగి తెలుసుకోనున్నారు.
Also Read: