Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. ఇలాంటి రోడ్డు ప్రమాదాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. గాలిలో ఎగిరిపడ్డా సేఫ్..!

మనం ఎలా ఉన్న కాసింత అదృష్టం మాత్రం మన వెంటే ఉండాలి అంటుంటారు పెద్దలు. రాసిపెట్టి ఉంటే.. ఎంత పెద్ద ప్రమాదాలు

Viral Video: షాకింగ్ యాక్సిడెంట్.. ఇలాంటి రోడ్డు ప్రమాదాన్ని ఎప్పుడూ చూసి ఉండరు.. గాలిలో ఎగిరిపడ్డా సేఫ్..!
Viral News
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 07, 2021 | 11:22 AM

మనం ఎలా ఉన్న కాసింత అదృష్టం మాత్రం మన వెంటే ఉండాలి అంటుంటారు పెద్దలు. రాసిపెట్టి ఉంటే.. ఎంత పెద్ద ప్రమాదాలు ఎదురైన తృటిలో తప్పించుకుంటాం. ఇప్పటివరకు అనేక రకాల యాక్సిడెంట్స్ వీడియోలు, సీసీ టీవీ ఫుటేజ్‏లు చూసుంటాం. అయితే ఇప్పుడు ఈ వీడియో చూస్తే షాకవ్వాల్సిందే. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదం. డ్రైవింగ్ చేసే సమయంలో రోడ్డుపై ఉన్న వాహనాలను గమనిస్తూనే ఎంతో అలర్ట్‏గా ఉండడటమే కాకుండా… చాకచక్యంగా వ్యవహరించాలని అర్థమవుతుంది. కారును ఢికొట్టి అమాంతం గాల్లో ఎగిరిపడ్డ ఆ యువతి.. ప్రాణాలతో బయటపడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఆ వీడియో.. నిర్మానుష్యంగా ఎలాంటి రద్దీ లేని రోడ్డుపై ఓ కారు టర్న్ అవుతుంది. ఆ వాహనం డ్రైవర్ నిదానంగా కారును మలుపు తిప్పుతున్న సమయంలో అటుగా స్కూటీపై వస్తున్న యువతి గమనించకుండా వేగంగా వచ్చి కారును ఢికొట్టింది. దీంతో అమాంతం గాల్లోకి ఎగిరి కారు ముందు పడింది. అంత పైగిరి ఎగిరి పడినా వెంటనే లేచి తనను తాను సర్దుకుంది. ఈ షాకింగ్ యాక్సిడెంట్ మొత్తం అక్కడున్న సీసీ టీవీలో రికార్డ్ అయ్యింది. అయితే ఈ యాక్సిడెంట్ ఎప్పుడు ఎక్కడ అయ్యిందో తెలీదు కానీ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హెల్మట్ ధరించడం వల్లే ఆ యువతి తలకు పెద్దగా గాయాలు కాలేదు. ఆ వీడియోను మీరు ఒకసారి చూసేయ్యండి.

వీడియో..

Also Read: Bnak News: ఈ బ్యాంకులో కస్టమర్లకు బంపర్‌ ఆఫర్లు.. సెప్టెంబర్‌ 30 వరకు వీటిపై ఎలాంటి ఛార్జీలు ఉండవు

SBI కస్టమర్లకు గుడ్‏న్యూస్.. సరికొత్త సేవలు అందుబాటులోకి.. వారికి ఊరట …

Good News: స్మార్ట్‌కార్డులున్న ప్రయాణికులు బుకింగ్ కౌంటర్‌కు రాకుండానే రీచార్జ్.. బంపర్ ఆఫర్ ప్రకటించిన రైల్వే శాఖ

Silver Price Today: బంగారం బాటలోనే వెండి ధరలు.. తగ్గుముఖం పట్టిన సిల్వర్‌ ధర.. హైదరాబాద్‌లో మాత్రం..