AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్.. వచ్చే నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి!

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న ఇస్రోకు చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో రూ. 3,985 కోట్లతో మూడో లాంచ్‌ప్యాడ్‌ను ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇస్రో నెక్ట్స్‌ జెనరేషన్‌ లాంచ్ వెహికల్స్ కోసం శ్రీహరికోటలో లాంచ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయడం, రెండవ లాంచ్‌ప్యాడ్‌కు స్టాండ్‌బై లాంచ్‌ప్యాడ్‌గా మద్దతునివ్వడం లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్‌కు కేబినేట్‌ ఓకే చెప్పింది..

శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్.. వచ్చే నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి!
Satish Dhawan Space Centre
Srilakshmi C
|

Updated on: Jan 17, 2025 | 2:15 PM

Share

శ్రీహరికోట, జనవరి 17: దేశ అంతరిక్ష వ్యవస్థలో మౌలిక సదుపాయాలకు కేంద్రం పెద్ద పీట వేస్తుంది. దీనిలో భాగంగా తాజాగా మరో కీలక నిర్ణయానికి కేంద్ర కేబినెట్‌ అమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్నటువంటి ఇస్రోకి చెందిన సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో మూడో లాంఛ్‌ ప్యాడ్‌ను నిర్మించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో భారత స్పేస్ రీసెర్చ్ డెవలప్మెంట్‌లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శ్రీహరి కోటలో మూడో లాంచ్‌ ప్యాడ్‌ని 48 నెలల (నాలుగేళ్లు) వ్యవధిలో నిర్మించడానికి మొత్తం రూ.3984 కోట్ల బడ్జెట్ వెచ్చించిందన్నారు. ఈ మేరకు గురువారం జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో సభ తీర్మానించినట్లు వెల్లడించారు.

శ్రీహరికోటలోని ఇస్రోలో అంతరిక్ష నౌకల లాంచ్‌కి అన్నివిధాలుగా సరిపోయే విధంగా మూడో లాంచ్‌ ప్యాడ్‌ను నిర్మించనున్నారు. ఇస్రో ప్రయోగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, నెక్స్ట్ జెనెరేషన్ లాంచ్ వెహికల్స్ (NGLV)కి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం శ్రీహరికోటలో రెండు లాంచ్ ప్యాడ్లు అందుబాటులో ఉన్నాయి. వీటికి బ్యాకప్‌గా 3వ లాంచ్ ప్యాడ్‌ని ఉపయోగించనున్నారు. న్యూ జనరేషన్‌ లాంచ్‌ వెహికల్‌(ఎన్‌జీఎల్‌వీ) ప్రోగ్రామ్‌ సహా ఇస్రో భవిష్యత్తు మిషన్‌లకు మూడో ప్యాడ్‌ ఎంతో సహాయకారి కానుంది. 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్‌)ను నెలకొల్పడం, 2040 నాటికి చంద్రుడిపైకి మానవ సహిత యాత్ర చేపట్టాలనే బృహత్‌ లక్ష్యాలు ప్రస్తుతం ఇస్రో ముందున్నాయి. అందుకే వచ్చే 25, 30 ఏళ్ల అవసరాలను తీర్చేలా ప్రణాళికలు రూపొందిస్తుంది.

ఇవి కూడా చదవండి

కాగా ప్రపంచ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో భారత్‌కి విశిష్ట ప్రాధాన్యం ఉంది. ఇస్రోలో ప్రస్తుతం ఉన్న 8,000 టన్నుల సామర్థ్యం ఉంది. అయినప్పటికీ 30,000 టన్నుల వ్యోమనౌకలను తక్కువ భూ కక్ష్యలో ఉంచగల సామర్ధ్యం ఇస్రోకి ఉంది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ 91మీటర్ల ఎత్తులో నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ (NGLV)ని కూడా అభివృద్ధి చేస్తోంది. లాంచ్‌ప్యాడ్ NGLVకి మాత్రమే కాకుండా సెమీక్రియోజెనిక్ దశతో ఉన్న LVM3 వాహనాలకు కూడా మద్దతు ఇవ్వడానికి అనుకూలమైన కాన్ఫిగరేషన్‌ను కలిగి ఉండేలా రూపొందిస్తున్నారు. ఇది 70 టన్నుల పేలోడ్‌ను తక్కువ భూమి కక్ష్యకు తరలించే సామర్థ్యాలతో NGLV స్కేల్డ్ అప్ కాన్ఫిగరేషన్‌లకు తీసుకు వెళ్లేలా రూపొందిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.