బీ కేర్‌ఫుల్ ఆల్.. ఆ పోస్టులు పోస్ట్ చేస్తే.. ఇక మీ పని అంతే..

సోషల్ మీడియా.. ఇది ఇప్పుడు సగటు మనిషి నిత్యం ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫాం. అయితే ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయడం.. చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అయితే దీనిని ఎంతో మంది శాస్త్ర విజ్ఞానానికి ఉపయోగిస్తే.. అదే సమయంలో సంఘ విద్రోహ శక్తులు.. దీనిని దుర్వినియోగం చేస్తూ.. సమాజంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే పలు సమయాల్లో సంయమనంగా ఉండాల్సిన తరుణంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని.. […]

బీ కేర్‌ఫుల్ ఆల్.. ఆ పోస్టులు పోస్ట్ చేస్తే.. ఇక మీ పని అంతే..
Social-Media
Follow us

| Edited By:

Updated on: Nov 04, 2019 | 7:59 PM

సోషల్ మీడియా.. ఇది ఇప్పుడు సగటు మనిషి నిత్యం ఉపయోగిస్తున్న ప్లాట్‌ఫాం. అయితే ఈ సోషల్ మీడియాలో ఏది పడితే అది పోస్ట్ చేయడం.. చాలా మందికి అలవాటుగా మారిపోయింది. అయితే దీనిని ఎంతో మంది శాస్త్ర విజ్ఞానానికి ఉపయోగిస్తే.. అదే సమయంలో సంఘ విద్రోహ శక్తులు.. దీనిని దుర్వినియోగం చేస్తూ.. సమాజంలో అలజడులు సృష్టించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే పలు సమయాల్లో సంయమనంగా ఉండాల్సిన తరుణంలో కొందరు సంఘ విద్రోహ శక్తులు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని.. సమాజంలో అశాంతిని రేకెత్తించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తాజాగా చారిత్రాత్మక తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. యూపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

మరికొద్ది రోజుల్లో అయోధ్య తీర్పు వెలువడనున్న నేపథ్యంలో.. తీర్పు అనంతరం.. సోషల్ మీడియా వేదికగా ఎవరైన రెచ్చిపోయి.. వివాదాస్పద పోస్టులు పెడితే సహించేది లేదంటూ హెచ్చరికలు జారీ చేశారు యూపీ డీజీపీ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరైనా.. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోడానికి ప్రయత్నిస్తే.. సహించేది లేదన్నారు.అంతేకాదు.. ఈ విషయంలో ఇంటెలిజెన్స్ విభాగం సర్వ సన్నద్ధంగా ఉందన్నారు. శాంతిభద్రతలను దెబ్బతీసేందుకు ప్రయత్నించే వారిపై జాతీయ భద్రతా చట్టం ప్రకారం కేసులు పెడతామంటూ హెచ్చరికలు జారీ చేశారు.

అంతేకాకుండా సోషల్ మాధ్యమాల్లో వస్తున్న పోస్టింగులను గమనించడానికి ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేశామని, ఎలాంటి అభ్యంతరకరమైన పోస్టులు వచ్చినా వారిపై వెంటనే చర్య తీసుకుంటామని తెలిపారు. మరోవైపు అయోధ్య తీర్పు వస్తున్న నేపథ్యంలో ఎవరు కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దంటూ సీఎం యోగి కోరారు. తీర్పు నేపథ్యంలో అధికారులందరికీ సెలవులను రద్దు చేశారు.