మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఎం సీఎం

సీపీఎం నేత..కేరళ సీఎం పినరయ్ విజయన్ మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారేం పవిత్రులు కాదని.. అమాయకులు అంతకంటే కాదంటూ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను కీర్తించడానికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ కూటమి యూడీఎఫ్ ప్రయత్నిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలోని అట్టాపాడి అనే ప్రాంతంలో పోలీసులు నలుగురు మావోయిస్టులను హతమార్చడాన్ని పినరయ్ సమర్థించుకున్నారు. అయితే కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి మావోయిస్టుల కాల్చివేతపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో సీఎం పినరయ్ విజయన్ స్పందిస్తూ.. కాంగ్రెస్ తీరుపై […]

మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేసిన సీపీఎం సీఎం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Nov 04, 2019 | 9:06 PM

సీపీఎం నేత..కేరళ సీఎం పినరయ్ విజయన్ మావోయిస్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారేం పవిత్రులు కాదని.. అమాయకులు అంతకంటే కాదంటూ వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులను కీర్తించడానికి కాంగ్రెస్ పార్టీకి అనుబంధ కూటమి యూడీఎఫ్ ప్రయత్నిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళలోని అట్టాపాడి అనే ప్రాంతంలో పోలీసులు నలుగురు మావోయిస్టులను హతమార్చడాన్ని పినరయ్ సమర్థించుకున్నారు.

అయితే కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి మావోయిస్టుల కాల్చివేతపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దీంతో సీఎం పినరయ్ విజయన్ స్పందిస్తూ.. కాంగ్రెస్ తీరుపై మండిపడ్డారు. చత్తీస్‌గఢ్‌, బీహార్‌లో మావోయిస్టుల చేతిలో పోలీసులు, రైతులు బలయ్యారన్నారు. కేరళలో కూడా అదేవిధంగా జరగాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయా? అంటూ ప్రతిపక్షాలను ప్రశ్నించారు. చట్టాన్ని ఎవరు దుర్వినియోగం చేసినా.. ప్రభుత్వం సహించదని, వారిని కఠినంగా శిక్షిస్తామంటూ పినరయ్ విజయన్ హెచ్చరించారు.