24 ఏళ్ల క్రితం కేసు నమోదు.. తాజాగా ఆమెను అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు!
ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ అరెస్ట్ అయ్యారు. 24 ఏళ్ల క్రితం నమోదైన పరువు నష్టం కేసులో తాజాగా ఢిల్లీ పోలీసులు అమెను అరెస్ట్ చేశారు. తనను కించపరిచే వ్యాఖ్యలు చేసి తన పరువుకు నష్టం కలిగించిందని ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా అప్పట్లో ఆమెపై కేసు పెట్టారు. ఈ కేసులో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని ఆమెను అరెస్ట్ చేశారు పోలీసులు.

Medha Patkar: ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ అరెస్ట్ అయ్యారు. పరువు నష్టం కేసులో ఢిల్లీ పోలీసులు ఇవాళ ( శుక్రవారం) అమెను అరెస్ట్ చేశారు.దాదాపు 24 ఏళ్ల క్రితం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా పెట్టిన కేసులో తాజాగా అమెను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కేసులో కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించారని రెండు రోజుల కిందటే ఢిల్లీ సాకేత్ కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో అమె న్యాయ స్థానం నుంచి తప్పించుకోవాలని చూస్తోందని, కోర్టుకు ప్రొబేషన్ బాండ్స్ కూడా సమర్పించలేదని వారెంట్‌లో పేర్కొంది. కోర్టు వారెంట్‌లో నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అమెను అరెస్ట్ చేసినట్టు సౌత్‌ఈస్ట్ డీసీపీ రవి కుమార్ సింగ్ ధృవీకరించారు.
అప్పట్లో అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్న వినయ్ కుమార్ సక్సేనా నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలతో అతనిపై మేధా పాట్కర్ కేసు పెట్టారు. ఆ తర్వాత ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో మేధా పాట్కర్ తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసి తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆరోపిస్తూ వీకే సక్సేనా ఆమెపై రెండు కేసులు పెట్టారు. సక్సేనా పిరికిపంద అని, హవాలా లావాదేవీల్లో ఆయన హస్తం ఉందని పాట్కర్ ఆరోపణలు చేయడంతో ఆమెపై 02-11-2000లో వీకే సక్సేనా పరువు నష్టం దావా వేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
