Snow Rain: ఉత్తరాది రాష్ట్రాల్లో హిమపాతం బీభత్సం.. పర్యటనకులను ఆకట్టుకుంటున్న ధవళవర్ణ దృశ్యాలు
ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రాల్లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఎటు చూసినా మంచే దర్శనిమిస్తోంది. ఇళ్లు, చెట్లు, రోడ్లు, వాహనాలు, పర్వతాలు, రన్‌వేలు ఇలా అన్నీ మంచుతో కప్పి ఉన్నాయి.

ఉత్తరాది రాష్ట్రాల్లో హిమపాతం బీభత్సం సృష్టిస్తోంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న మంచుతో జనజీవనం స్తంభించిపోయింది. ఇళ్లు, రన్‌వేలను మంచు కప్పేసింది. పలుచోట్ల ఉష్ణోగత్రలు మైనస్‌డిగ్రీలకు పడిపోయాయి. ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో భారీగా మంచు వర్షం కురుస్తోంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లో రాష్ట్రాల్లో మంచు బీభత్సం సృష్టిస్తోంది. ఎటు చూసినా మంచే దర్శనిమిస్తోంది. ఇళ్లు, చెట్లు, రోడ్లు, వాహనాలు, పర్వతాలు, రన్‌వేలు ఇలా అన్నీ మంచుతో కప్పి ఉన్నాయి.మంచు తీవ్రతతో చలి కూడా పెరిగింది. శ్రీనగర్‌లో సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.
జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో మంచువర్షం కురిపిస్తోంది. శ్రీనగర్, బారాముల్లాలో కురుస్తున్న మంచు వానతో చలి తీవ్రత మరింత పెరిగింది. శ్రీనగర్, రాజౌరి, సోన్‌మార్గ్, బందీపురాతో పాటూ చాలా ప్రాంతాల్లో రోడ్లపై మంచు పేరుకుపోయింది. గుల్‌మార్గ్, పహల్‌గావ్ పర్యాటక రిసార్ట్ లు మంచుతో నిండిపోయాయి. పొగమంచు కమ్మేయడంతో 200మీటర్ల దిగువకు పడిపోయింది విజిబులిటీ. మంచుతో ఆ ప్రాంతాలన్నీ శ్వేతవర్ణంతో మెరిసిపోతున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని చార్‌ధామ్‌లో భారీ మంచు కురుస్తోంది. పవిత్ర కేదార్‌నాథ్ క్షేత్రం పూర్తిగా మంచుతో నిండిపోయింది. ఆలయం సమీపం లోని అన్ని భవనాలు మంచుతో నిండిపోయాయి. చమోలీలో పర్వత ప్రాంతాల నుంచి ఒక్కసారిగా భారీ హిమపాతం దూసుకొచ్చింది.




హిమాచల్‌ప్రదేశ్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. రోడ్లపై భారీగా హిమపాతం పేరుకుపోయింది. రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో నీరు, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. మండోలి, సిమ్లా తదితర ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




