Snake venom: రూ. కోట్ల విలువైన పాము విషం స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన గ్యాంగ్.. ఒక్క గ్రాము విషం విలువెంతో తెలుసా?
'వైల్డ్ క్రైమ్ ప్రివెన్షన్ బ్రాంచ్', అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కోట్ల రూపాయల విలువైన పాము పాయిజన్ పట్టుబడింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. పాము విషం స్మగ్లింగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ మేరకు దాడి చేశారు. కలకత్తా నుంచి అసన్సోల్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పటిష్ఠ నిఘా..

అసన్సోల్, డిసెంబర్ 29: ‘వైల్డ్ క్రైమ్ ప్రివెన్షన్ బ్రాంచ్’, అటవీశాఖ సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో కోట్ల రూపాయల విలువైన పాము పాయిజన్ పట్టుబడింది. ఈ ఘటనలో నలుగురిని అరెస్టు చేశారు. పాము విషం స్మగ్లింగ్ గురించి పక్కా సమాచారం అందుకున్న అధికారులు ఈ మేరకు దాడి చేశారు. కలకత్తా నుంచి అసన్సోల్‌కు అక్రమ రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. నిజాం ప్యాలెస్ నుంచి ఈ స్మగ్లర్ల కదలికలపై ‘వైల్డ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో’ నిఘా పెట్టినట్లు సమాచారం.
పురూలియాలోని కన్సావతి రేంజ్, అసన్సోల్ ఫారెస్ట్ రేంజ్‌కు చెందిన నిందితులు అసన్సోల్ నుంచి పురూలియాకు వాహనంలో పాము విషాన్ని తీసుకెళ్తుండగా రెడ్‌హ్యండెడ్‌గా అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అసన్‌సోల్‌లోని దిసర్‌ఘర్ సమీపంలో విష స్మగ్లర్లు పట్టుబడ్డారు. వారిని సమీపంలోని సంక్తారియా అవుట్‌పోస్టుకు తరలించారు. పాము విషంతో పాటు కారును, అందులో ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. పాము విషాన్ని క్రిస్టల్, లిక్విడ్ ఫార్మాట్‌లో రెండు ఆంపౌల్స్‌లో తీసుకువెళ్తున్నారు. అటవీ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
ఈ నిందితులు ఇంట్రా-స్టేట్ పాము విషం స్మగ్లింగ్ రింగ్‌కు చెందిన వారిగా గుర్తించారు. నిందితులను ఈ రోజు (శుక్రవారం) కోర్టులో హాజరు పరుస్తామని అసన్‌సోల్ రేంజ్ ఆఫీసర్ సంజీవ్ పతి తెలిపారు. సాధారణంగా పాము విషం ధర పాము రకాన్ని బట్టి నిర్ణయించబడుతుంది. ఈ విషం ఏ పాముకు చెందిందనే విషయం ఇంకా తెలియరాలేదు. వివిధ రకాల పాముల విషం గ్రాము ధర 6 లక్షల రూపాయల వరకు ఉంటుందని అటవీ శాఖ వర్గాల సమాచారం. అంటే ఇది బంగారం కంటే ఖరీదైనదన్నమాట. తాజాగా దొరికిన పాము విషం విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని అటవీ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.