ఒక్క టికెట్ వారి జీవితాన్ని మార్చేసింది.. ఇంతకీ ఏమైందో తెలుసా?

కొంతమందిని చూస్తే వీడు.. నక్క తోక తొక్కాడు అందుకే అదృష్టం పట్టింది అంటుంటారు. అలా ఉంటుంది వారి లక్. నిజంగా కొంతమందిని అదృష్ట దేవత ఏ మార్గంలో కరుణిస్తుందో ఊహించడమే కష్టంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఇటీవల తెలంగాణకు చెందిన ఓ డ్రైవర్ ఎక్కడో దుబాయ్‌లో లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.28 కోట్లకు అధిపతిని చేసింది. అచ్చం అలాంటి ఘటనే మరొకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. కేరళలోని కొల్లాం జిల్లాలో ఆరుగురు స్నేహితులు రాత్రికి […]

ఒక్క టికెట్ వారి జీవితాన్ని మార్చేసింది.. ఇంతకీ ఏమైందో తెలుసా?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Sep 20, 2019 | 9:01 PM

కొంతమందిని చూస్తే వీడు.. నక్క తోక తొక్కాడు అందుకే అదృష్టం పట్టింది అంటుంటారు. అలా ఉంటుంది వారి లక్. నిజంగా కొంతమందిని అదృష్ట దేవత ఏ మార్గంలో కరుణిస్తుందో ఊహించడమే కష్టంగా ఉంటుంది. సరిగ్గా అలాంటి ఘటనే ఇటీవల తెలంగాణకు చెందిన ఓ డ్రైవర్ ఎక్కడో దుబాయ్‌లో లాటరీ టికెట్ కొంటే ఏకంగా రూ.28 కోట్లకు అధిపతిని చేసింది. అచ్చం అలాంటి ఘటనే మరొకటి ఇప్పుడు వైరల్‌గా మారింది. కేరళలోని కొల్లాం జిల్లాలో ఆరుగురు స్నేహితులు రాత్రికి రాత్రే కోటీశ్వరులుగా మారిపోయారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఇది చదవండి.

కేరళ కొల్లాం జిల్లాలో ఉన్న ఓ నగల దుకాణంలో రాజీవన్, రామ్‌జిమ్ , రోనీ, వివేక్, సుబిన్, రతీష్ అనే ఆరుగురు మిత్రులు బుధవారం ఓ లాటరీ టికెట్ కొన్నారు. అందరిలాగే వీరు సరదాగే కొనుకున్నారు. ఆ మరుసటి రోజు గురువారం వీరు కొన్న లాటరీకి సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. అనూహ్యంగా మొదటి ఫ్రైజ్ TM160869 టికెట్‌ను వరించింది. ఈ ఆరుగురు స్నేహితులు కొన్న ఈ లాటరీ టికెట్‌కే మొదటి బహుమతి రావడంతో వీరు ఏకంగా రూ.12 కోట్లు జాక్‌పాట్ కొట్టారు. అయితే వీరంతా గెలుచుకున్నది రూ.12 కోట్లయినా అన్ని కటింగులూ పోనూ చేతికి వచ్చేది మాత్రం రూ.7.5 కోట్ల రూపాయలు. ఒక్క లాటరీ టికెట్ వీరి జీవితాన్ని రాత్రికి రాత్రే మార్చేయడంతో ఈ ఆరుగురు స్నేహితుల ఆనందానికి అవధులు లేవు. తాము గెలుచుకున్న సొమ్ముతో తమకు ఉన్న అప్పులు తీర్చేస్తామని, ఆ తర్వాత వివిధ సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని వీరు చెప్పారు.