AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బస్సు డ్రైవర్‌కు హెల్మెట్ లేదంటూ చలానా..!

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన మోటర్ వెహికిల్ యాక్ట్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా.. మరిన్ని రాష్ట్రాల్లో పెనాల్టీల విషయంలో స్వల్ప మార్పులు తెచ్చాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్తున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చాక.. చిత్ర విచిత్రమైన ఘటనలు చూడాల్సి వస్తుంది. కొందరి వాహనదారులకు చలాన్ల రూపంలో మోత మోగుతుంటే.. మరికొందరికి […]

బస్సు డ్రైవర్‌కు హెల్మెట్ లేదంటూ చలానా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Sep 21, 2019 | 12:49 AM

Share

సెప్టెంబర్ 1వ తేదీ నుంచి నూతన మోటర్ వెహికిల్ యాక్ట్ అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం తెచ్చిన ఈ చట్టం ఇప్పటికే పలు రాష్ట్రాల్లో అమలవుతుండగా.. మరిన్ని రాష్ట్రాల్లో పెనాల్టీల విషయంలో స్వల్ప మార్పులు తెచ్చాయి. ఇక మరికొన్ని రాష్ట్రాలు మాత్రం ఈ చట్టాన్ని అమలు చేయబోమని తేల్చి చెప్తున్నాయి. అయితే ఈ చట్టం అమలులోకి వచ్చాక.. చిత్ర విచిత్రమైన ఘటనలు చూడాల్సి వస్తుంది. కొందరి వాహనదారులకు చలాన్ల రూపంలో మోత మోగుతుంటే.. మరికొందరికి వింత పెనాల్టీలను చూడాల్సి వస్తుంది. అయితే ఢిల్లీలో అలాంటి విత పెనాల్టీ ఘటన ఒకటి దేశ రాజధానిలో వెలుగులోకి వచ్చింది. నోయిడాకు చెందిన ఓ బస్సు డ్రైవర్ హెల్మెట్ పెట్టుకోలేదంటూ.. పోలీసులు రూ.500 పెనాల్టీ వేశారు. ఈ నెల 11న గౌతమ్‌ బుద్ధ నగర్‌ పోలీసులు ఈ చలానా రాసినట్లు బాధితుడు పేర్కొన్నారు.

విషయానికి వస్తే.. నోయిడాకు చెందిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ కంపెనీ.. బస్సులను అద్దెకు ఇస్తూ ఉంటుంది. దాదాపు ఆ ట్రావెల్స్ సంస్థకు 80 బస్సులు ఉన్నాయి. అయితే ఆ బస్సులు రోజు బయట తిరిగేవి కావడంతో.. ఆ బస్సు డ్రైవర్లు ఎక్కడైనా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిచారా అన్న విషయం తెలుసుకునేందుకు ఓ ఉద్యోగుడిని నియమించుకున్నారు. అయితే ఆ ఉద్యోగి అన్ని బస్సుల వివరాలు చెక్ చేస్తుండగా.. ఓ బస్సుకు పోలీసులు విధించిన జరిమానా చూసి షాక్ తిన్నారు. బస్సు వివరాలు చెక్ చేస్తుండగా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో రూ.500 పెనాల్టీ విధించినట్లు ఆ చలానా ఉంది. అయితే వాహన నంబర్ మాత్రం బస్సుదే ఉండటం చూసి అవాక్కయ్యారు ఆ సంస్థ ఉద్యోగులు. అయితే ఇలాంటి విచిత్ర చలాన్లు గతంలో కూడా ఎదురయ్యాయని ఆ ట్రావెల్స్ యాజమాన్యం తెలిపింది. మూడు నెలల క్రితం ఒకే రోజు ఒకే బస్సుకు మూడు చలాన్లు విధించారని.. అయితే పెనాల్టీలు వేశారు కానీ.. అసలు ఆ పెనాల్టీలు దేనికోసం అన్నది ఆ చలాన్లో తెల్పలేదన్నారు. అయితే, ఆన్‌లైన్లో నమోదు చేయడంలో ఏదో పొరపాటు జరిగి ఉంటుందని పోలీసులు తెలిపారు. త్వరలో సరిచేసిన జరిమానా యజమానికి పంపుతామని తెలిపారు. అయితే బస్సు నంబరుతోనే మరేదైనా ద్విచక్ర వాహనం అక్కడ తిరుగుతుందా లేక.. పొరబాటున వాహనం నంబర్ తప్పుగా ఎంటర్ చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి నూతన వాహన చట్టం అమలులోకి వచ్చాక.. దేశ వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులకు చలాన్ల మోత తప్పడంలేదు.

Follow Us
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
ఎస్బీఐ కొత్త విత్ డ్రా రూల్స్.. నెలకు నాలుగు మాత్రమే..
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
అతను ఆల్‌రౌండర్ ఏంటి గంభీర్.. సిరాజ్‌ను పక్కనెట్టి మరీ ఛాన్స్..!
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
స్పెషల్‌ టెట్‌లో 70.07% ఉత్తీర్ణత.. నవంబర్‌లో మరోసారి TET నిర్వహణ
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
నాని 'ది ప్యారడైజ్' సినిమాను వదులుకున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
వేల రూపాయలు పెట్టి వాడినా.. భరించలేని చర్మ దురదలకు స్పీడ్ తో చెక్
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
AI కెమెరా చేసిన పనికి రూ. 500 ట్రాఫిక్ చలాన్..!
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
నోటికి కమ్మగా, కడుపుకి హాయిగా.. కమ్మటి పెసర కట్టు
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
18 కోట్లతో లవ్ ఫెయిల్యూర్ కుర్రాళ్ల కోసమే సినిమా.. 14 ఏళ్లుగా..
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఓవెన్ లేకుండా గోధుమ పిండి, బెల్లంతో కరకరలాడే బిస్కెట్లు!
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..
ఆ రోజే అకౌంట్లోకి పీఎం కిసాన్ నిధులు.. కేంద్రం లైన్ క్లియర్..