Sivakasi: దీపావళి అంటే గుర్తొచ్చే శివకాశి టర్నోవర్ ఎంతో తెలుసా.? ఊహించలేరు..
శివకాశి.. భారతదేశంలో మూడు కాశీలు ఉన్నాయి. ఉత్తరాదిన ఉన్న వారణసిగా పిలిచే కాశీ ఒకటైతే, దక్షిణాదిన టెన్ కాశి, శివకాశి. 1400 ఏట ఇక్కడ కాశి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి శివన్ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శతాబ్దం క్రితం కరువు విలయతాండవం ఆడుతున్న రోజుల్లో అక్కడనున్న వ్యాపారులు బాణసంచా పరిశ్రమను ప్రారంభించారు. తొలుత స్టార్ మ్యాచ్ బాక్స్ సంస్థ పేరుతో అగ్గిపెట్టెలు తయారీ మొదలుపెట్టారు...

దీపావళి అనగానే ముందుగా ప్రస్తావన కొచ్చేది టపాసులు. చిన్న, పెద్దా, ఆ మతం ఈ మతం అన్న తేడా లేకుండా టపాసులు కాల్చి సరదాగా గడపడం ఆనవాయితీ. టపాసులు ఏడాదిలో ఒక్కసారి ఒకటి రెండు గంటల్లోపు కాల్చేసి అంతటితో సరదా తీరిపోతుంది. కానీ ఏడాదిలో ఒక్కరోజు పండుగ కోసం 11 నెలల పాటు లక్షలాది మంది కార్మికుల శ్రమ, వేల కోట్ల టర్నోవర్ ఉంటుంది. దేశంలో అతిపెద్ద బాణసంచా పరిశ్రమ తమిళనాడు లోని శివకాశి కేంద్రంగా నడుస్తోంది.
శివకాశి.. భారతదేశంలో మూడు కాశీలు ఉన్నాయి. ఉత్తరాదిన ఉన్న వారణసిగా పిలిచే కాశీ ఒకటైతే, దక్షిణాదిన టెన్ కాశి, శివకాశి. 1400 ఏట ఇక్కడ కాశి నుంచి శివలింగాన్ని తీసుకొచ్చి శివన్ ఆలయాన్ని నిర్మించారు. ఇక్కడ శతాబ్దం క్రితం కరువు విలయతాండవం ఆడుతున్న రోజుల్లో అక్కడనున్న వ్యాపారులు బాణసంచా పరిశ్రమను ప్రారంభించారు. తొలుత స్టార్ మ్యాచ్ బాక్స్ సంస్థ పేరుతో అగ్గిపెట్టెలు తయారీ మొదలుపెట్టారు. ఆ తర్వాత దీపావళికి ఉపయోగించే టపాసులు తయారు చేయడం మొదలు పెట్టారు. తొలి ఏడాదిలోనే పదివేల మందికి ఉపాధి అందింది. అలా ప్రతీ ఏటా ఒక్కో సంస్ధ పెరుగుతూ 650కి పైగా బాణసంచా పరిశ్రమలు ఏర్పడ్డాయి.
ఇక అనుమతులు లేకుండా నడుస్తున్న పరిశ్రమల సంఖ్య నాలుగు వందలకు పైమాటే. దీపావళి జరిగే నెల రోజుల ముందు ఉత్పత్తి జరగదు. ఈ నెల రోజులపాటు కేవలం ట్రేడింగ్ మాత్రమే జరుగుతుంది. దీపావళి పండుగ అయిన వారం రోజుల తర్వాత మళ్లీ పరిశ్రమలు ఉత్పత్తులను మొదలుపెడతాయి. ఏడాదిలో 11 నెలల పాటు టపాసుల తయారీ జరుగుతూనే ఉంటుంది. శివకాశి పరిసర ప్రాంతాల్లో ఉన్న వెయ్యికి పైగా పరాశ్రమల్లో 3 లక్షల మంది ఉపాధి పొందితున్నారు. కేవలం ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే ఉపయోగించే సామగ్రి కోసం ఇంత మొత్తంలో ఉపాధి మరే రంగంలోనూ చూడలేం. ఇక పరోక్షంగా ఈ రంగంపై లక్షకుపైగా ఉపాధి పొందుతున్నారు. శివకాశి పరిసరాల్లో ఉన్న సుమారు 60 గ్రామాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, దుకాణాలతో కేవలం ఈ పరిశ్రమల మీదే ఆధారపడి జీవిస్తుంటారు.
మరి ఇంతమంది పనిచేసే బాణసంచా శివకాశి మార్కెట్ 2022 టర్నోవర్ ఎంతో తెలుసా.. అక్షరాలా 6 వేల కోట్లు ఈ ఏడాది 6700 కోట్లుగా లెక్క తేలింది. కోవిడ్ కారణంగా గత మూడేళ్లు నష్టాలను చూసిన శివకాశి ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. ఇది కూడా కేవలం దీపావళి ముందుగా నెల రోజులపాటు జరిగే మార్కెట్ మాత్రమే. ఇక ఉత్సవాలు, ఎన్నికల సభలు, ఇతరత్రా వేడుకల్లో వాడే బాణసంచా మార్కెట్ సుమారు మూడు వందల కోట్లు ఉంటుంది. ఇది ఏడాది పొడవునా జరిగే చిల్లర వ్యాపారంగా స్థానిక పరిశ్రమ నిర్వాహకులు చెబుతుంటారు.
ఇక అక్కడ తయారై దేశం నలుమూలల తరలించేందుకు ట్రాన్స్‌పోర్ట్, దీపావళి సందర్భంగా మార్కెట్‌లో అమ్మకాలు.. ఆ టర్నోవర్ రెండింతలు దాటుతుంది. ఉదాహరణకు ఎమ్‌ఆర్‌పీ ధరతో పోలిస్తే శివకాశిలో ఒక టపాసు ధర పదింతలు తక్కువ , 50 mrp అయితే అక్కడ 5 రూపాయలకే విక్రయిస్తారు. సో ఈ లెక్కన దీవాలి టపాసుల టర్నోవర్ ఏ స్థాయిలో ఉందో చెప్పక్కర్లేదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..
