Business: వస్తువుల వారంటీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై..

ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వస్తువును కొనుగోలు చేసిన చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తువు వస్తుంది. అలాగే ఇన్‌స్టాల్‌ చేయడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది. కానీ వారంటీ మాత్రం కొనుగోలు చేసిన తేదీ నుంచే వర్తిస్తుంది. దీనికి చెక్‌ పెట్టడానికే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూజర్లు వస్తువులు కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌ను ఇన్‌స్టాల్ చేసిన రోజు నుంచే వారంటీని అమలు చేయాలని వైట్‌ గూడ్స్‌ (కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు) తయారీ సంస్థలు, విక్రేతలను కేంద్రం కోరింది...

Business: వస్తువుల వారంటీల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై..
Warranty On White Goods
Follow us
Narender Vaitla

|

Updated on: Nov 11, 2023 | 4:59 PM

పండుగ సీజన్‌లో కొత్త వస్తువు కొనుగోలు చేయాలనే ఆలోచన మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌, గృహోపకరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. అయితే ఇలాంటి వస్తువులకు కంపెనీలు వారంటీని ఇస్తుంటాయి. అయితే వస్తువు ఇన్‌స్టాల్ చేసిన నాటి నుంచి కాకుండా మీరు కొనుగోలు చేసిన నాటి నుంచే వారంటీ వర్తిస్తుంది. ఇప్పట వరకు ఇలాంటి విధానమే అమల్లో ఉంది.

అయితే ఆన్‌లైన్‌లో వస్తువులు కొనుగోలు చేసిన సమయంలో వస్తువును కొనుగోలు చేసిన చాలా రోజుల తర్వాత ఇంటికి వస్తువు వస్తుంది. అలాగే ఇన్‌స్టాల్‌ చేయడానికి మరికొన్ని రోజులు సమయం పడుతుంది. కానీ వారంటీ మాత్రం కొనుగోలు చేసిన తేదీ నుంచే వర్తిస్తుంది. దీనికి చెక్‌ పెట్టడానికే కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యూజర్లు వస్తువులు కొనుగోలు చేసిన ప్రొడక్ట్‌ను ఇన్‌స్టాల్ చేసిన రోజు నుంచే వారంటీని అమలు చేయాలని వైట్‌ గూడ్స్‌ (కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీలు) తయారీ సంస్థలు, విక్రేతలను కేంద్రం కోరింది.

వస్తువునును కొనుగోలు చేసిన తేదీని వారంటీ/గ్యారంటీగా పరిగణలోకి తీసుకోకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇందులో భాగంగానే వారంటీ విధానంలో మార్పులు చేసుకోవాలని వైట్‌ గూడ్స్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇందుకు సంబంధించి పరిశ్రమల సంఘాలు సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, శామ్‌సంగ్, ఎల్జీ, ప్యానాసోనిక్, బ్లూస్టార్, కెంట్, వర్ల్‌పూల్, వోల్టాస్, బాష్, హావెల్స్, ఫిలిప్స్, తోషిబా, డైకిన్, సోనీ, హిటాచి, ఐఎఫ్‌బీ, గోద్రేజ్, హయర్, యూరేకా ఫోర్బ్స్, లైడ్‌ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం లేఖ రాసింది.

ఈ విషయమై కంపెనీలకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్‌ కుమార్‌ లేఖ రాశారు. వినియోగదారుల పరిరక్ష చట్టం 2019 ప్రకారం.. ప్రొడక్ట్‌ను ఉపయోగించని కాలానికి వారంటీని అమలు చేయడం అనుచిత చర్య అని లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం పండుగ సీజన్‌లో పెద్ద ఎత్తున అమ్మకాలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..