Recharge plans: రెండు సిమ్స్ రీఛార్జ్ చేయలేకపోతున్నారా.? మీ కోసమే ఈ బెస్ట్ ప్లాన్స్..
వీటిలో ఒకటి వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటే మరొకటి వ్యాపార, ఉద్యోగ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఒకప్పుడు లైఫ్ ఇన్‌కమ్ కాల్స్ ఉచితం అన్న టెలికం కంపెనీలు ఇప్పుడు ఆ అవకాశాన్ని తొలగించాయి. కనీసం రీఛార్జ్ చేయకపోతే ఇన్‌కమ్ కాల్స్, మెసేజ్‌లను నిలిపివేస్తున్నాయి. దీంతో బ్యాంకులకు, మరే ఇతర అవసరాలకు నెంబర్ ఇచ్చిన వారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలా రెండు సిమ్‌లకు రీఛార్జ్ చేద్దామా అంటే బడ్జెట్...
ఒకప్పుడు కేవలం సింగిల్ సిమ్‌ను మాత్రమే ఉపయోగించే వారు. కానీ ఎప్పుడైతే డ్యూయల్ సిమ్ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయో అప్పటి నుంచి రెండు సిమ్‌లను ఉపయోగించే వారి సంఖ్య పెరిగింది. స్మార్ట్ ఫోన్స్‌లోనూ డ్యూయల్ సిమ్ ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో రెండు సిమ్‌కార్డులను తీసుకున్నారు.
వీటిలో ఒకటి వ్యక్తిగతంగా ఉపయోగించుకుంటే మరొకటి వ్యాపార, ఉద్యోగ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. అయితే ఒకప్పుడు లైఫ్ ఇన్‌కమ్ కాల్స్ ఉచితం అన్న టెలికం కంపెనీలు ఇప్పుడు ఆ అవకాశాన్ని తొలగించాయి. కనీసం రీఛార్జ్ చేయకపోతే ఇన్‌కమ్ కాల్స్, మెసేజ్‌లను నిలిపివేస్తున్నాయి. దీంతో బ్యాంకులకు, మరే ఇతర అవసరాలకు నెంబర్ ఇచ్చిన వారు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అలా రెండు సిమ్‌లకు రీఛార్జ్ చేద్దామా అంటే బడ్జెట్ ఎక్కువుతోంది. అయితే ఇలాంటి వారి కోసమే టెలికం కంపెనీలు తక్కువ ధరతో కూడిన కొన్ని రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొచ్చాయ. అలాంటి చీప్ రీఛార్జ్ ప్లాన్స్‌పై ఓ లుక్కేయండి..
* టెలికం రంగంలో పెను సంచలనంగా దూసుకొచ్చిన రిలయన్స్ జియో తమ యూజర్ల కోసం 336 రోజుల వ్యాలిడిటీతో కూడిన ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.1559తో రీఛార్జ్ చేసుకుంటే 336 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లను ఉచితంగా పొందొచ్చు. అలాగే 34 జీబీ డేటా పొందొచ్చు. అంటే నెలకు సుమారు రూ. 141లోపే అన్నమాట. ఇక ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే అదనంగా జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ సేవలను పొందొచ్చు.
* దేశంలో మరో అతిపెద్ద టెలికం సంస్థ అయిన ఎయిర్ టెల్ రూ. 1799తో మరో ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. దీంతో అన్‌లిమిటెడ్ కాల్స్, 3600 ఎస్‌ఎమ్‌ఎస్‌లతో పాటు 24 జీబీ డేటాను పొందొచ్చు. నెలకు రూ. 150 పడుతుంది. అదనంగా వింక్ మ్యూజిక్, హలో ట్యూన్స్ వంటి సేవలను ఉచితంగా పొందొచ్చు.
* ఇక వొడాఫోన్‌ఐడియా (వీ) విషయానికొస్తే.. రూ. 1799తో రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఇది 365 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్ లిమిటెడ్ కాల్స్, 24 జీబీ మొబైల్ డేటా పొందొచ్చు. ఈ లెక్కన నెలకు రూ. 150 పడుతుంది. ఈ ప్లాన్‌తో అదనంగా వీఐ మూవీస్, టీవీకి ఉచిత యాక్సిస్‌ని పొందొచ్చు.
* ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ రూ. 1251 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల వ్యాలిడీతో లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాల్స్‌ను పొందొచ్చు. తక్కువ ధరలో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్న వారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్‌గా చెప్పొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..