Sister Abhaya: సిస్ట‌ర్ అభ‌య కేసులో దోషుల‌కు శిక్ష ఖ‌రారు.. యావ‌జ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సీబీఐ కోర్టు

28 సంవ‌త్స‌రాల కింద‌ట సంచ‌ల‌న సృష్టించిన సిస్ట‌ర్ అభ‌య హ‌త్య కేసులో సీబీఐ కోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన‌ విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఫాద‌ర్ థామ‌స్....

Sister Abhaya: సిస్ట‌ర్ అభ‌య కేసులో దోషుల‌కు శిక్ష ఖ‌రారు.. యావ‌జ్జీవ శిక్ష విధిస్తూ తీర్పునిచ్చిన సీబీఐ కోర్టు
Follow us

|

Updated on: Dec 23, 2020 | 12:48 PM

28 సంవ‌త్స‌రాల కింద‌ట సంచ‌ల‌న సృష్టించిన సిస్ట‌ర్ అభ‌య హ‌త్య కేసులో సీబీఐ కోర్టు మంగ‌ళ‌వారం సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన‌ విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఫాద‌ర్ థామ‌స్ కొట్టూరు, న‌న్ సెఫీని సీబీఐ ప్ర‌త్యేక న్యాయ‌స్థానం దోషులుగా తేల్చింది. అయితే బుధ‌వారం ఈ దోషుల‌కు కోర్టు శిక్ష ఖ‌రారు చేసింది. యావజ్జీవ శిక్ష విధిస్తూ కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది.

కాగా, 1992 మార్చి 27న కొట్టాయంలో సిస్ట‌ర్ అభ‌య హ‌త్య‌కు గురైంది. అయితే సిస్ట‌ర్ అభ‌య‌ను ఫాద‌ర్ థామస్ కొట్టూర్‌, న‌న్ సెఫీ క‌లిసి హ‌త్య చేసినట్లు కోర్టు నిర్ధారించింది. కాగా, 28 ఏళ్ల త‌ర్వాత ఈ హ‌త్య కేసులు తీర్పు వెల్ల‌డైంది. ఈ కేసు విచార‌ణ‌ను 1993లో సీబీఐకి అప్ప‌గించింది. అనంత‌రం సిస్ట‌ర్ అభ‌య హ‌త్య‌కు గురైంద‌ని తేల్చింది. అభ‌య ప్ర‌మాద‌వ‌శాత్తు బావిలో ప‌డి మ‌ర‌ణించి ఉండ‌వ‌చ్చ‌ని ముందుగా పోలీసులు భావించారు. కానీ మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త జోమోన్ పుతెన్‌పుర‌క్క‌ల్ ఇది హ‌త్య‌గా అనుమానించి హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో కేసు విచార‌ణ‌ను 1993లో సీబీఐకి అప్ప‌గించగా, విచారణ అనంతరం అభ‌య హ‌త్య‌కు గురైన‌ట్లు సీబీఐ తేల్చింది.

ఆమె భుజం, కుడి చెవిపై బ‌ల‌మైన గాయాలైన‌ట్లు విచార‌ణ‌లో తేలింది. అయితే ఈ ఘ‌ట‌న జ‌రిగిన 12 ఏళ్ల త‌ర్వాత సెయింట్ పియ‌స్ కాన్వెంట్‌లో అధ్యాప‌కులుగా ప‌ని చేస్తున్న ఫాద‌ర్ థామ‌స్ కొట్టార్‌, జోన్ పుత్రుక్క‌యిల్‌తో పాటో మ‌రో క్రైస్త‌వ స‌న్యాసిని సెఫేల‌ను 2008లో సీబీఐ అరెస్టు చేయగా,  విచారణ ఇన్నేళ్లు ప‌ట్ట‌డంతో ఎన్నో విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ కేసు నుంచి త‌ప్పించుకునేందుకు ఫాద‌ర్ కొట్టూరు, న‌న్ సెఫీలు తీవ్రంగా ప్ర‌య‌త్నించినా సీబీఐ ముందు వారి ప్ర‌య‌త్నాలు ఏ మాత్రం ఫ‌లించ‌లేదు. వీరిద్ద‌రినీ తాజాగా జ‌రిగిన విచార‌ణలో దోషులుగా నిర్ధారించిన తిరువ‌నంత‌పురం సీబీఐ ప్ర‌త్యే కోర్టు శిక్ష ఖ‌రారు చేసింది. కాగా, సీబీఐ కోర్టు తీర్పు అనంత‌రం మాన‌వ హ‌క్కుల కార్య‌క‌ర్త జోమ‌న్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కేసు విచార‌ణ ఇంత కాలం ప‌ట్టినా.. చివ‌రికి బాధితురాలికి న్యాయం జ‌రిగింద‌ని అన్నారు.

కాగా, ఈ కేసులో ముందుగా సీబీఐ ముగ్గురిపై కేసు న‌మోదు చేయ‌గా, నిందితుల్లో ఒక‌రైన ప‌త్రుక్క‌యిల్‌ను 2018లో కోర్టు నిర్ధోషిగా ప్ర‌క‌టించింది. మిగ‌తా ఇద్ద‌రి డిశ్చార్జ్ పిటిష‌న్ల‌ను తిర‌స్క‌రించి నిన్న దోషుల‌గా తేల్చి నేడు శిక్ష ఖ‌రారు చేసింది.

Abhaya Case: సిస్ట‌ర్ అభ‌య కేసు: సుదీర్ఘ విచార‌ణ త‌ర్వాత గెలిచిన న్యాయం

Sister Abhaya Case Verdict: కేర‌ళ‌ సిస్ట‌ర్ అభ‌య హ‌త్య కేసు: 28 ఏళ్ల త‌ర్వాత సంచ‌ల‌న తీర్పు ఇచ్చిన కోర్టు

చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
చిగుళ్ల వ్యాధి గుండెపోటుకు కారణం కావచ్చు.. వివరాలు తెలుసుకోండి
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
'కాస్త సిగ్గుండాలే'.. RCB ఆటగాళ్లు చేసిన పనికి అభిమానుల ఆగ్రహం
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
ఈ చిన్నది ఓ స్టార్ హీరోయిన్ చెల్లి.. ఆ పాన్ ఇండియా నటి ఎవరంటే.?
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
వామ్మో, ఇదేం డ్యాన్స్‌రా సామీ.. నాగిని పాటకు పైథాన్‌ స్టెప్పులు..
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే