ఆ వార్తలు నిరాధారం, ముంబై క్లబ్ లో నన్ను అరెస్టు చేయలేదు, సుశానే ఖాన్ వివరణ, ఏది నిజం ? ఏది అబధ్ధం ?
ముంబైలోని ఓ క్లబ్ లో కోవిడ్ రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణపై క్రికెటర్ సురేష్ రైనా, సింగర్ గురు రంధావా సహా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి.

ముంబైలోని ఓ క్లబ్ లో కోవిడ్ రూల్స్ ఉల్లంఘించారన్న ఆరోపణపై క్రికెటర్ సురేష్ రైనా, సింగర్ గురు రంధావా సహా బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ ను కూడా పోలీసులు అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. డ్రాగన్ ఫ్లై క్లబ్ లో సోమవారం రాత్రి వీరితో బాటు సుమారు 30 మందికి పైగా చేరి ఉండగా ఖాకీలు వీరిని అరెస్టు చేసి ఆ తరువాత బెయిలుపై విడుదల చేశారు. కానీ తనను అరెస్టు చేయలేదని, ఈ క్లబ్ లో తెల్లవారు జామున రెండున్నర గంటలకు అధికారులు వచ్చారని, కానీ తమను మూడు గంటలవరకు కూర్చోబెట్టి ఉదయం 6 గంటలకు వదిలివేశారని సుసానే వెల్లడించింది. అంతే తప్ప మమ్మల్ని అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తలు సరికావని, బాధ్యతారాహిత్యమని ఆమె స్పష్టం చేసింది. సుదీర్ఘ వివరణకూడా ఇచ్చింది.
అటు-క్రికెటర్ సురేష్ రైనాకు లోకల్ టైమింగ్స్, ప్రొటొకాల్స్ తెలియవని, కానీ అధికారులు చేసిన సూచనలకు అనుగుణంగా ఆయన నడుచుకున్నారని అయన మేనేజ్ మెంట్ వెల్లడించింది. ప్రభుత్వ సంస్థలు జారీ చేసే గైడ్ లైన్స్ ను రైనా ఎప్పుడూ పాటిస్తాడని, ఏమైనా జరిగిన దురదృష్టకర సంఘటనకు విచారం వ్యక్తం చేశాడని ఈ మేనేజ్ మెంట్ సిబ్బంది తెలిపారు. ఇక సింగర్ గురు రంధావా ప్రకటన కూడా సేమ్ ఇలాగే ఉంది. ఇక చెప్పేదేముంది ?



