Shraddha Murder Case: శ్రద్ధ తలకోసం చెరువుని ఖాళీ చేస్తోన్న పోలీసులు.. ఇప్పటి వరకూ 13 ముక్కలు లభ్యం..
శ్రద్ధా వాకర్ హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమైన ఢిల్లీ పోలీసులు ఆమె తల కోసం చాలా కష్టపడుతున్నారు. అఫ్తాద్ ఆమె తలను ఢిల్లీలోని ఓ చెరువులో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆమె తల కోసం మెహ్రౌలీలోని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు.
ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతంలో జరిగిన శ్రద్దా హత్య కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఢిల్లీతో పాటు హిమాచల్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రల్లో ఆధారాల కోసం పోలీసు బృందాలు వెతుకుతున్నాయి. అయితే అఫ్తాబ్‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 18 నాటి సిసిటివి ఫుటేజీని పోలీసుల పరిశీలించారు. అందులో అఫ్తాబ్ మూడుసార్లు వచ్చి వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అఫ్తాబ్ చేతిలోని బ్యాగ్‌లో శ్రద్ధ మృతదేహంలోని ముక్కలు ఉన్నాయని.. అవి బయట విసిరివేయడానికి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు జరిపిన విచారణలో మృత దేహంలోని 13 ముక్కలు పోలీసులకు లభించాయి. అయితే శ్రద్ధా తల ఆచూకీ లభించలేదు. అదే సమయంలో మృతదేహాన్ని నరికిన ఆయుధం లభ్యం కాలేదు.
శ్రద్ధా వాకర్ హత్య కేసును ఛేదించే పనిలో నిమగ్నమైన ఢిల్లీ పోలీసులు ఆమె తల కోసం చాలా కష్టపడుతున్నారు. అఫ్తాద్ ఆమె తలను ఢిల్లీలోని ఓ చెరువులో పడేసినట్లు చెప్పాడు. దీంతో పోలీసులు ఆమె తల కోసం మెహ్రౌలీలోని చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. చెరువులోని నీటిని ఖాళీ చేస్తున్నారు. నివేదికల ప్రకారం, మునిసిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ (MCD) సహాయంతో పోలీసులు ఆదివారం (నవంబర్ 20) మెహ్రౌలీ చెరువును ఖాళీ చేసే పనిని ప్రారంభించారు. మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటిని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. అయితే ఈ చెరువు చాలా పెద్దదని 15-20 అడుగుల లోతు ఉంటుందని అంచనా వేస్తున్నారు అధికారులు.
నిందితుడు అఫ్తాబ్ సూచన మేరకు పోలీసులు చెరువును ఖాళీ చేసేందుకు చర్యలు చేపట్టారు. శ్రద్ద నరికిన తలను చెరువులో పడేసినట్లు నిందితులు విచారణలో పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ చెరువు సమీపంలోని అడవిలో అనేక శరీర భాగాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి పోలీసులు మెహ్రౌలీ చెరువు నుంచి పంపుల ద్వారా నీటిని తోడే పనిని ప్రారంభించారు. ఆ వార్త రాసే సమయానికి నీటి వెలికితీత పనులు ఆగిపోయాయి. పోలీసులు చెరువును పూర్తిగా ఖాళీ చేస్తారా లేక దానిలోని నీటిని కొంత స్థాయికి వదిలేస్తారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. మృతురాలి తలను కనుగొనడానికి పోలీసులు డైవర్ల సహాయం కూడా తీసుకోవచ్చని భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.
గత వారం రోజులుగా పోలీసులు మెహ్రౌలీ అడవుల నుండి కొన్ని ఎముకలను కనుగొన్నారు. వీటిలో తొడ ఎముక, మణికట్టు, మోచేతి మధ్య ఉన్న ఎముక, మోకాలి చిప్ప వంటివి ఉన్నట్లు తెలుస్తోంది. ఎముకలపై కొన్ని పదునైన ఆయుధాల గుర్తులు కనిపిస్తున్నాయని కూడా చెప్పారు.
అఫ్తాబ్ ఈ ఏడాది మే 18న శ్రద్ధను గొంతుకోసి హత్య చేశాడు. ఈ కేసులో సాక్ష్యాధారాల కోసం ఢిల్లీ పోలీసులు తమ బృందాన్ని గత శుక్రవారం మహారాష్ట్ర, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లకు పంపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..