AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రేమజంట దారుణ హత్య.. అడవిలో నగ్నంగా దొరికిన మృతదేహాలు.. యువకుడి ఒంటిపై..

యువకుడి ప్రైవేట్ భాగాన్ని కోసేసినట్టుగా గుర్తించారు.  బాలిక ప్రైవేట్ భాగంలో గాయాల గుర్తులు కూడా కనిపించాయి. మృతదేహం కింద లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువకుడిని గుర్తించారు.

ప్రేమజంట దారుణ హత్య.. అడవిలో నగ్నంగా దొరికిన మృతదేహాలు.. యువకుడి ఒంటిపై..
Crime
Jyothi Gadda
|

Updated on: Nov 20, 2022 | 7:38 PM

Share

దేశంలో దారుణాలు ఆగడం లేదు.. ఢిల్లీలో శ్రద్ధా హత్య కేసు విచారణ కొనసాగుతుండగా, పశ్చిమబెంగాల్‌లో మాజీ నేవీ ఉద్యోగి మర్డర్‌ కలకలం రేపింది. తాజాగా రాజస్థాన్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు 20 కిలోమీటర్ల దూరంలో ఓ జంట మృతదేహాలు కలకలం రేపాయి. ఉదయ్‌పూర్‌ సమీపంలోని ఉబేశ్వర్‌జీ అడవుల్లో శుక్రవారం ఓ యువకుడు, యువతి నగ్న మృతదేహాలు లభ్యమయ్యాయి. హత్యానంతరం ఇద్దరినీ ఏదో రసాయనం పోసి కాల్చే ప్రయత్నం చేశారు. యువకుడి ప్రైవేట్ పార్ట్ నరికివేయగా, బాలిక ప్రైవేట్ భాగంలో గాయం గుర్తులు కూడా కనిపించాయి. ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ ఘటన జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా, మృతిచెందిన యువకుడికి వివాహమైందని, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. కాగా ఆ యువతి అవివాహితురాలు అని చెబుతున్నారు.

శుక్రవారం ఉదయం ఉబేశ్వర్‌జీ అడవిలో యువకుడు, యువతి మృతదేహాలు పడి ఉండడాన్ని గ్రామస్థులు చూశారు. పరిస్థితులను బట్టి చూస్తే, దారుణంగా హత్య చేసిన తర్వాత, వారిని కాల్చడానికి ప్రయత్నించినట్లు కనిపించింది. వారి శరీరాలు సగం కాలిన స్థితిలో కనిపించాయి. యువకుడి ప్రైవేట్ భాగాన్ని కోసేసినట్టుగా గుర్తించారు.  బాలిక ప్రైవేట్ భాగంలో గాయాల గుర్తులు కూడా కనిపించాయి. మృతదేహం కింద లభించిన మొబైల్ ఫోన్ ఆధారంగా యువకుడిని గుర్తించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలోదర గ్రామానికి చెందిన రాహుల్ మీనా s/o చతర్‌సింహ మీనా అనే యువకుడు అడ్వాస్‌లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం రాహుల్‌ అదృశ్యంపై అతని తండ్రి హెడ్ కానిస్టేబుల్ చతర్ సింగ్ మీనా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అదే సమయంలో ఉదయపూర్ సమీపంలోని మదార్ గ్రామానికి చెందిన సోనూ కుమార్తె భూర్ సింగ్ అనే బాలికను గుర్తించారు. యువకుడికి గతంలోనే వివాహమైంది. ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారని, మృతిచెందిన బాలిక అవివాహితురాలిగా తెలిసింది.

ఇవి కూడా చదవండి

ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితమే ఇద్దరూ హత్యకు గురైనట్టుగా పోలీసులు గుర్తించారు. బాలికపై సామూహిక అత్యాచారం కూడా జరిగిందనే భయం కూడా వ్యక్తమవుతోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్