AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shraddha: ఢిల్లీ హత్య కేసులో పోలీసుల చేతికి కీలక సాక్ష్యాధారం.. శ్రద్ధాను చిత్రహింసలు పెట్టిన అఫ్తాబ్‌..!

శ్రద్ధ హత్య తర్వాత కూడా అఫ్తాబ్ అదే ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. అతను శ్రద్ధా సోషల్ మీడియా ఖాతాలను కూడా ఉపయోగిస్తూనే ఉన్నాడు, తద్వారా ఆమె హత్యపై ఎవరికీ అనుమానం రాలేదు.

Shraddha: ఢిల్లీ హత్య కేసులో పోలీసుల చేతికి కీలక సాక్ష్యాధారం.. శ్రద్ధాను చిత్రహింసలు పెట్టిన అఫ్తాబ్‌..!
Shraddha Walker
Jyothi Gadda
|

Updated on: Dec 26, 2022 | 10:38 AM

Share

శ్రద్ధావాకర్ దారుణ హత్యోదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తన జీవిత భాగస్వామిగా ఉన్న శ్రద్ధను 2018లో డేటింగ్ యాప్‌ ద్వారా అఫ్తాబ్ పరిచయం చేసుకున్నాడు. ఈ ఏడాది మే 8న ఇద్దరూ ఢిల్లీ వచ్చారు. మే 18న శ్రద్ధను 35 ముక్కలుగా నరికి చంపిన అఫ్తాబ్ 18 రోజుల్లో ఆ విడిభాగాలను ఢిల్లీలోని వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు. ఈ కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలు కీలక ఆధారాలను సేకరిస్తున్నారు. తాజాగా, ఈకేసుకు సంబంధించి ఆడియో రికార్డులు స్వాదీనం చేసుకున్నారు. దొరికిన ఆడియోలను ఢిల్లీ పోలీసులు పెద్ద సాక్ష్యంగా పరిగణిస్తున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకోవడానికి ఈ ఆడియో ఎంతగానో దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.

శ్రద్ధా హత్య కేసులో ఢిల్లీ పోలీసులకు భారీ ఆడియో ఆధారాలు లభించాయి. అఫ్తాబ్‌కి సంబంధించిన ఆడియో పోలీసులకు దొరికింది. ఇందులో అఫ్తాబ్, శ్రద్ధతో గొడవపడుతున్నాడు. ఈ ఆడియోలో అఫ్తాబ్, శ్రద్ధా మధ్య వాదన వినిపిస్తోంది. అంతే కాదు అఫ్తాబ్ శ్రద్ధాను చిత్రహింసలకు గురిచేస్తున్నట్లు ఆడియో ద్వారా రుజువైంది. ఈ ఆడియోలను ఢిల్లీ పోలీసులు పెద్ద సాక్ష్యంగా పరిగణిస్తున్నారు. హత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ఈ ఆడియో హత్యకు సంబంధించిన విచారణకు ఎంతగానో దోహదపడుతుందని, విచారణలో పాల్గొన్న అధికారులు చెబుతున్నారు. ఈ ఆడియోతో అఫ్తాబ్ వాయిస్‌తో మ్యాచ్ అయ్యేలా పోలీసులు అతని వాయిస్ శాంపిల్‌ను తీసుకుంటారు. సీబీఐ సీఎఫ్‌ఎస్‌ఎల్ బృందం అఫ్తాబ్ వాయిస్ శాంపిల్ తీసుకుంటుంది.

అఫ్తాబ్ ఇప్పటికీ తీహార్ జైలులోనే ఉన్నాడు. సోమవారం ఉదయం 8 గంటలకు ఆయనను తీహార్ జైలు నుంచి సీబీఐ తీసుకెళ్లింది. శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌కు నార్కో టెస్ట్ నిర్వహించారు. అంతకుముందు అతనికి పాలిగ్రాఫ్ పరీక్ష కూడా చేశారు.

ఇవి కూడా చదవండి

పోలీసుల విచారణలో శ్రద్ధను హత్య చేసింది తానేనని అఫ్తాబ్ అంగీకరించాడు. అఫ్తాబ్ శ్రద్ధా ప్రేమికులు. ఇద్దరూ ముంబై వాసులు కాగా, కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి మకాం మార్చారు. ఢిల్లీలోని మెహ్రౌలీలో ఫ్లాట్ తీసుకొని ఇద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్‌లో జీవిస్తున్నారు. మే 18న శ్రద్ధాతో గొడవపడ్డాడని అఫ్తాబ్ చెప్పాడు. ఆ తర్వాత శ్రద్ధను గొంతుకోసి హత్య చేశాడు. ఆ తర్వాత అఫ్తాబ్ శ్రద్ధా శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశాడు. అఫ్తాబ్ ఈ ముక్కలను ఫ్రిజ్‌లోనే దాచిపెట్టాడు. మెహ్రౌలీ అడవిలో శ్రద్ధా మృతదేహం ముక్కలను రోజుకోకటి చొప్పున రాత్రిపూట వెళ్లి అడవుల్లో విసిరేసేవాడు

శ్రద్ధ హత్య తర్వాత కూడా అఫ్తాబ్ అదే ఫ్లాట్‌లో నివసిస్తున్నాడు. అతను శ్రద్ధా సోషల్ మీడియా ఖాతాలను కూడా ఉపయోగిస్తూనే ఉన్నాడు, తద్వారా ఆమె హత్యపై ఎవరికీ అనుమానం రాలేదు. శ్రద్ధా ఖాతాల నుంచి అఫ్తాబ్‌ 54 వేల రూపాయలను బదిలీ చేశాడు. ఈక్రమంలోనే శ్రద్ధా తండ్రి ఇచ్చిన మిస్సింగ్‌ కేసు ఆధారంగా పోలీసులు.. శ్రద్ధా మొబైల్ లొకేషన్, బ్యాంకు ఖాతా వివరాల సాయంతో పోలీసులు అఫ్తాబ్‌ను చేరుకున్నారు. నవంబర్ 12న అఫ్తాబ్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
దేశంలోనే అత్యంత చౌక ధరల దుకాణం.. డీ-మార్ట్‌కి పెద్ద పోటీ..!
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
ఒక్క టీ20 సిరీస్ కూడా గెలవని సఫారీలపై..పంజా విసరడానికి భారత్ రెడీ
అందంలో మాత్రం అజంతా శిల్పం
అందంలో మాత్రం అజంతా శిల్పం
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
తగ్గేదేలే అక్కా.. జుట్లు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్న..
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
జన్ ధన్ ఖాతాల్లో ఎంత డబ్బు ఉందో తెలుసా? కీలక వివరాలు వెల్లడి
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ఒక పరుగు తేడా..చివరి బంతి వరకు ఊపిరి బిగబట్టించిన మ్యాచ్‌లివే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
ప్రతి గంటకు 5నిమిషాలు ఇలా చేశారంటే ఫిట్‌గా ఉంటారు!లాభాలు తెలిస్తే
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
భారతదేశంలో మరో పవర్‌ఫుల్‌ ఎలక్ట్రిక్‌ కారు.. స్టైలిష్‌ లుక్‌తో..
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన క్రేజీ హీరోయిన్
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు