Shocking: పిచ్చిపట్టినట్లు రెచ్చిపోయిన టీచర్.. చిన్నారిని బాల్కనీ నుంచి తోసేసింది..

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Dec 16, 2022 | 5:33 PM

దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని మోడల్‌బస్తీలో దారుణం జరిగింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాలికల పాఠశాలలో ఓ టీచర్‌ కోపంతో రెచ్చిపోయింది. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది.

Shocking: పిచ్చిపట్టినట్లు రెచ్చిపోయిన టీచర్.. చిన్నారిని బాల్కనీ నుంచి తోసేసింది..
School Teacher

దేశ రాజధాని ఢిల్లీ కరోల్‌బాగ్‌లోని మోడల్‌బస్తీలో దారుణం జరిగింది. మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాలికల పాఠశాలలో ఓ టీచర్‌ కోపంతో రెచ్చిపోయింది. పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తించింది. స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న చిన్నారిపై ప్రతాపం చూపింది. మొదటి అంతస్థులోని బాల్కనీ నుంచి తోసేసింది. ఈఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

మున్సిపల్‌ కార్పొరేషన్‌ బాలిక విద్యాలయంలో ప్రైమరీ టీచర్‌గా పనిచేసే గీతా దేశ్వాల్‌కు పిల్లలు అల్లరి చేయడంతో చిర్రెత్తుకొచ్చింది. వందన అనే చిన్నారిని పేపర్‌ కటింగ్‌ చేసే కత్తెరతో చితకబాదింది. కోపం తగ్గకపోవడంతో స్కూల్‌ ఫస్ట్‌ఫ్లోర్‌లోని బాల్కనీలోకి తీసుకొచ్చి కిందకు తోసేసింది.కిందపడిపోయిన వందనకు తీవ్రగాయాలయ్యాయి. పాపను వెంటనే స్థానికంగా ఉండే బడా హిందూరావు ఆస్పత్రికి తరలించారు. వందన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న దేశబంధు పీఎస్‌ పోలీసులు స్పాట్‌కి చేరుకొని విచారణ చేపట్టారు. తోటి టీచర్లు, విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. టీచర్‌ గీతను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. గతంలోనూ టీచర్‌ గీత ఇలానే విద్యార్థులను కర్రలతో కొట్టినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆమెను ఉద్యోగం నుండి తొలగించి, కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu