Shatrughan Sinha : కేంద్ర ప్రభుత్వంపై శత్రుఘ్న సిన్హా సెటైర్లు.. రిహన్నాకు మద్దతుగా నిలిచిన మాజీ బీజేపీ నేత
రైతు ఉద్యమంపై విదేశీ సెలెబ్రెటీలు స్పందింస్తున్న తీరును తప్పుబడుతున్న ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా సెటైర్లు విసిరారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతు పలుకుతూ..
Shatrughan Sinha : రైతు ఉద్యమంపై విదేశీ సెలెబ్రెటీలు స్పందింస్తున్న తీరును తప్పుబడుతున్న ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా సెటైర్లు విసిరారు. అమెరికా ఎన్నికల సమయంలో ట్రంప్‌కు మద్దతు పలుకుతూ ప్రధాని మోదీ జోక్యం చేసుకున్నారని గుర్తు చేశారు. అంతకంటే పెద్దదైన విషయమేమీ ఇది కాదని అన్నారు. దేశంలో జరుగుతున్న రైతు ఉద్యమంపై విదేశీ సెలెబ్రెటీలు స్పందించిన తీరు అభినందనీయం అని పేర్కొన్నారు.
సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ రైతులు నిరసన వ్యక్తం చేసి.., నిరసనకు రైతులు ఓ కొత్త రూపాన్ని ఇచ్చారని శత్రుఘ్న సిన్హా అభినందించారు. ఇది ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని వెల్లడించారు. ఈ క్రమంలోనే సెలెబ్రెటీలు స్పందించారని ఆయన వారిని సమర్థించారు.
రైతుల ఉద్యమాన్ని చూసే విదేశీ సెలెబ్రెటీలు రైతుకు మద్దతిచ్చారని తెలిపారు. గ్లోబల్ ప్రపంచంలో వారు కూడా భాగస్వాములు కాబట్టే వారు స్పందిస్తున్నారని అన్నారు. పాప్ సింగర్ రిహన్నా ట్వీట్‌తో వచ్చిన నష్టమేమి? ఆమె ఏం రాశారు? రైతుల ఉద్యమం గురించి ఎందుకు మాట్లాడుకోకూడదు అని ప్రశ్నించారు కాంగ్రెస్ నేత శత్రుఘ్న సిన్హా.
ఇవి కూడా చదవండి
ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం… సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ
Czech Woman Marry Gujranwala : ఔను.. వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు.. ఆమెకు 65.. ఆయనకు 23..