ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం… సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ

తమిళనాడు రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వరాలు జల్లు కురిపించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కే పళనిస్వామి ఇలాంటి కీలక నిర్ణయం ప్రకటించడంతో పెద్ద సంచలనంగా మారింది.

ముఖ్యమంత్రి సంచలన నిర్ణయం... సహకార బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల మాఫీ

TN CM Loan Waiver : తమిళనాడు రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి వరాలు జల్లు కురిపించారు. రైతులకు రుణమాఫీ చేస్తున్నట్లుగా అసెంబ్లీలో ప్రకటించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం కే పళనిస్వామి ఇలాంటి కీలక నిర్ణయం ప్రకటించడంతో పెద్ద సంచలనంగా మారింది. సహకార బ్యాంకుల్లో తీసుకున్న రూ.12,110 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తున్నట్లుగా సీఎం ప్రకటించారు.

నిర్ణయాన్ని సత్వరమే అమలు చేయనున్నట్లుగా ప్రకటించారు. కాగా తమ ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలని నేరువేరుస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. సీఎం నిర్ణయంతో సమామరు 16.43 లక్షల మంది రైతులకు లబ్ది చేకూరనుంది.

మరో రెండు నెలల్లో తమిళనాడులో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ప్రతిపక్ష డీఎంకే పై విమర్శలు గుప్పించారు. గతంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పేదలకు 2 ఎకరాలు ఇస్తామన్న హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు.

ఇవి కూడా చవండి : 

కారు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్.. అందుబాటు ధరల్లో మారుతి సుజుకి కార్లు.. వివరాలివే..

కేరళలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ఫ్లాన్.. కాషాయం కండువా కప్పుకున్న మాజీ డీజీపీ జాకబ్ థామస్