Maruti suzuki: కారు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్.. అందుబాటు ధరల్లో మారుతి సుజుకి కార్లు.. వివరాలివే..

Maruti Suzuki true value: ఆర్థికమైన పరిస్థితుల కారణంగా.. ఎక్కువ బడ్జెట్ కారణంగా మీరు కారు కొనలేకపోతున్నారా.. అయితే మీ లాంటి వారి కోసం దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి..

Maruti suzuki: కారు కొనాలనుకుంటున్నవారికి గుడ్‌న్యూస్.. అందుబాటు ధరల్లో మారుతి సుజుకి కార్లు.. వివరాలివే..
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 05, 2021 | 3:57 PM

Maruti Suzuki true value: ఆర్థికమైన పరిస్థితుల కారణంగా.. ఎక్కువ బడ్జెట్ కారణంగా మీరు కారు కొనలేకపోతున్నారా.. అయితే మీ లాంటి వారి కోసం దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసే సదుపాయాన్ని కల్పిస్తోంది. అది కూడా మంచి మంచి ఆఫర్లతో అతి తక్కువ ధరలతో అందిస్తోంది. దీని ద్వారా మీరు అతి తక్కువ ధరకే కారును సొంతం చేసుకోవచ్చు. మారుతి సుజుకి ట్రూ వాల్యూ ద్వారా సెకెండ్ హ్యాండ్ కార్లను వినియోగదారుల కోసం తీసుకువచ్చింది. వీటిని టెస్ట్ డ్రైవ్ చేసి డీలర్ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈఎమ్ఐ సౌకర్యాన్ని కూడా కల్పిస్తోంది.

కేవలం రూ .1.70 లక్షలకే.. రూ.5 లక్షల విలువైన కారు మారుతి సుజుకి ట్రూ వాల్యూ కింద.. మారుతిలో పలు మోడళ్ల సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేయవచ్చు. ఈ మేరకు www.marutisuzukitruevalue.com వెబ్‌సైట్‌లో సెకెండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన వివరాలను ధర, డీలర్ చిరునామా, యజమానుల పేర్లతో సహ పొందుపరిచింది. దీనిలోని వివరాల ప్రకారం.. మారుతి సుజుకిలోని వాగన్ ఆర్ విఎక్స్ఐ కారు ధర కేవలం రూ.1.70లక్షల రూపాయలకే విక్రయిస్తున్నారు. ఈ కారు ఆన్-రోడ్ ధర రూ .55.5 లక్షలకు పైగా ఉంది. దీనిలో మోడళ్లను బట్టి రేట్లను కేటాయించారు. ఇంకెందుకు ఆలస్యం.. మీకెమైనా కార్లు కావాలంటే.. www.marutisuzukitruevalue.com/buy-car/ వెబ్‌సైట్‌కు వెళ్లి చెక్ చేసుకోండి.

Also Read:

World’s Costliest Crop: ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మొక్కను పండిస్తున్న బీహార్ వాసి.. కిలోకి లక్ష ఆదాయం