Benefits of Black Pepper: పోపుల పెట్టె ఔషధాల గని… నల్ల మిరియాలతో కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!

ప్రకృతి కి మనిషికి అవినాభావ సంబంధం ఉంది.. పంచభూతాలు ప్రకృతి అయితే.. ఆ పంచభూతాల నిర్మాణమే మానవ శరీరం.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అందుకనే మనం కాలానికి అనుగుణంగా...

Benefits of Black Pepper: పోపుల పెట్టె ఔషధాల గని... నల్ల మిరియాలతో కలిగే ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకుందాం..!
Follow us

|

Updated on: Feb 05, 2021 | 2:12 PM

Benefits of Black Pepper: ప్రకృతి కి మనిషికి అవినాభావ సంబంధం ఉంది.. పంచభూతాలు ప్రకృతి అయితే.. ఆ పంచభూతాల నిర్మాణమే మానవ శరీరం.. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. అందుకనే మనం కాలానికి అనుగుణంగా దొరికే సీజనల్ పండ్లు, కూరగాయలు తినాలని పెద్దలు ఎప్పుడో చెప్పారు. తాజాగా పరిశోధకులు కూడా అదే మాట చెబుతున్నారు. ఇక మన భారతీయుల వంటఇంట్లో ఉండే పోపుల పెట్టె ఔషధాల గని… పోపుల పెట్టెలో ఉండే నల్ల మిరియాల గురించి దానిలో దాగున్న ఔషధ గుణాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..!

సుగంధ ద్రవ్యాల్లో ప్రత్యేక స్థానం ఉన్న నల్ల మిరియాలను క్వీన్ ఆఫ్ స్పైసెస్‌గా పిలుస్తారు. వీటిని మన దేశంలో ఒకప్పుడు ఎక్కువగా పండించేవారు. ఆహారంలో రుచిని పెంచడానికి వీటిని వాడుతున్నా.. ఆరోగ్య గుణాలు ఉన్నాయనేది నిగూఢ రహస్యం.

* వీటిల్లో ఎ,సి,కె విటమిన్ల తో పాటు మినరల్స్ అధికంగా ఉండడం, ఆరోగ్యకరమైన ఫ్యాటీ యాసిడ్స్ సహజసిద్దమైన మెటబాలిక్ వంటివి శరీరానికి బూస్టర్‌లా పనిచేస్తాయి. * బ్లాక్ పెప్పర్‌గా పిలుచుకునే నల్ల మిరియాలు శరీరంలో పేరుకున్న క్యాలరీలను కరిగిస్తాయి. కొత్త ఫ్యాట్ సెల్స్ ఉత్పత్తి అవకుండా చూస్తాయి. * కొంచెం ఘాటుగా ఉన్నా తినగలిగిన వారు రోజూ రెండు మిరియాలు నోట్లో వేసుకుంటే శరీరంలోని మెటబాలిజంను క్రమబద్ధం చేస్తుంది. * రోజూ మీరు తాగే టీలో చిటికెడు మిరియాల పోడి వేసుకుని తాగితే కూడా ఫలితం ఉంటుంది. * ఉదరంలో వాయువులు ఏర్పడినప్పుడు కప్పు మజ్జిగలో పావు చెంచా మిరియాల పొడిని కలిపి తీసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేకాదు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. * మార్కెట్లో బ్లాక్ పెప్పర్ ఆయిల్ రూపంలో కూడా దొరుకుతుంది. రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ముందే గ్లాసు నీటిలో ఒక చుక్క ఆయిల్ వేసుకుని తాగితే అధిక బరువుపై ప్రభావం చూపిస్తుంది. * రెండు, మూడు స్పూన్ల మిరియాలను నువ్వుల నూనెలో వేయించి పొడి చేసి నొప్పి ఉన్న ప్రాంతంలో తలనొప్పి, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి బాధించే నొప్పులు ఉన్నవారు అక్కడ కట్టు కడితే నొప్పి, వాపు తగ్గుతుంది. * అజీర్ణ సమస్యలతో బాధపడే వారు మిరియాలపొడికి కొద్దిగా బెల్లం కలిపి రోజూ రాత్రి పూట ఆహారం తినడానికి ముందు తీసుకుంటే కడుపు ఉబ్బరం తగ్గుతుంది. *నల్ల మిరియాలు మరియు పసుపు కలిపినా మిశ్రమం ద్వారా దంతాలు మరియు చిగుళ్ళు కోల్పోపోయిన బలాన్ని తిరిగి అందిస్తాయి. నల్ల మిరియాలు మరియు పసుపు రెండింటిని సమాన మొత్తంలో కలపండి. చేతి వేళ్ళతో, *చిగుళ్ళపై మసాజ్ చేయండి. 5 నిమిషాల తరువాత నోటిని, నీటితో కడిగి వేయండి *అధిక బరువు ఉన్నవారు భోజనానికి గంట ముందు అరగ్రాము మిరియాల పొడిని తేనెతో తీసుకుని వేడి నీళ్లు తాగితే గుణం కనిపిస్తుంది. *మిరియాల నూనెను వాడటం వలన మీ దంతాలు ఉడిపోయే ప్రక్రియను తగ్గించుకోవచ్చు. వదులైన దంతాల ప్రాంతాలలో మిరియాల నూనెను రాయటం వలన చిగుళ్ళకు బలాన్ని చేకూర్చవచ్చు. మిరియాల నూనెను నోటిని శుభ్రం చేసే ద్రావణంగా కూడా వాడవచ్చు. *రొమ్ము క్యాన్సర్ నివారించడానికి మిరియాలు బాగా సహకరిస్తాయి. ఇందులో విటమిన్ ఎ, సి, కెరోటిన్స్, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఉండే హానికారక ప్రీరాడికల్స్ ను తొలగించి క్యాన్సర్ కణాల వృద్ధిని అడ్డుకుంటాయి. మిరియాలు తరచుగా తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సరే కాదు చర్మ, పెద్దపేగు క్యాన్సర్ల ముప్పు కూడా తగ్గుతుందని స్టడీస్ తేల్చాయి. *తలనొప్పి అరగ్రాము మిరియాల పొడి, ఒక గ్రాము బెల్లం కలిపి రోజూ ఉదయం, సాయంత్రం తీసుకుంటే.. తలనొప్పి నుంచి ఈజీగా బయటపడవచ్చు.

ఇవే కాకుండా మొటిమలు తగ్గేందుకు, యాంటీ బయోటిక్‌గా, అసిడిటీ సమస్యకు, శరీరంలో అధిక వేడికి మిరియాలు చక్కని ఔషధంగా పనిచేస్తాయి. అయితే వీటిని తగినంత మోతాదులోనే తీసుకోవాలి. లేదంటే సమస్య తీవ్రతరమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అతి సర్వత్రా వర్జయేత్ అన్నారు కదా పెద్దలు

Also Read:

కరోనా నివారణ కోసం వాడుతున్న వేస్ట్ మాస్కులకు అర్ధాన్ని కల్పించిన శాస్త్రవేత్తలు.. బెస్ట్ రోడ్ల నిర్మాణం

హాఫ్ సెంచరీ చేసిన సిబ్లీ.. మంచి సహకారం అందిస్తోన్న రూట్..

Latest Articles