Health: పోపుల పెట్టెలో ఉండే లవంగం చేసే మేలు ఏంటో తెలుసా..? కీళ్ల నొప్పుల నుంచి, నోటి సమస్యల వరకు..

Health Benefits With Clove: కచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగది ఉంటుంది. ఆ వంటి గదిలో ఒక పోపుల పెట్టె ఉంటుంది. ఆ పోపుల పెట్టెలో కచ్చితంగా ఉండే ఆహార వస్తువు లవంగం. చూడ్డానికి చిన్నగా, సన్నగా కనిపించినా...

Health: పోపుల పెట్టెలో ఉండే లవంగం చేసే మేలు ఏంటో తెలుసా..? కీళ్ల నొప్పుల నుంచి, నోటి సమస్యల వరకు..
cloves
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 05, 2021 | 5:31 AM

Health Benefits With Clove: కచ్చితంగా ప్రతి ఒక్కరి ఇంట్లో వంటగది ఉంటుంది. ఆ వంటి గదిలో ఒక పోపుల పెట్టె ఉంటుంది. ఆ పోపుల పెట్టెలో కచ్చితంగా ఉండే ఆహార వస్తువు లవంగం. చూడ్డానికి చిన్నగా, సన్నగా కనిపించినా ఒక్కసారి నోట్లో వేసుకుంటే దాని పవర్‌ ఏంటో అర్థమవుతుంది. అంతేనా దీన్ని కూరలో వేస్తే వచ్చే రుచే వేరు. ఇలా ప్రతి ఒక్కరి ఇంట్లో కచ్చితంగా ఉండే లవంగం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని మీకు తెలుసా? లవంగాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఓసారి చూద్దాం…

* నోటి దుర్వాసన సమస్యకు చెక్‌ పెట్టడంలో లవంగాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే యాంకీ బ్యాక్టీరియా లక్షణాలు నోటిలో సూక్ష్మ క్రిములు పెరగకుండా నివారిస్తుంది. రోజూ భోజనం చేసిన తర్వాత లవంగాలను నోట్లో వేసుకొని నమిలితే మంచి ఫలితం ఉంటుంది.

* లవంగాలు నోటి సమస్యలను కూడా దూరం చేస్తాయి. ముఖ్యంగా దంతాల నొప్పి, చిగుళ్ల సమస్యలను నివారిస్తాయి. ఎక్కువగా టూత్‌ పేస్ట్‌ బ్రాండ్‌లు లవంగం ఫ్లేవర్‌తో ఎందుకు తయారు చేస్తాయో ఇప్పుడు అర్థమైందా..?

* లవంగాలు జీర్ణశక్తి పెరగడంలో క్రీయాశీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల గ్యాస్‌, కడుపుబ్బరం వంటి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.

* కొంతమంది ప్రయాణాలు చేసేప్పుడు వాంతులు చేసుకుంటారు. ఇలాంటి వారు ప్రయాణం చేసే సమయంలో నోట్లో ఒక లవంగం ముక్క వేసుకొని చప్పరిస్తే వికారం, వాంతుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

* లవంగాలు షుగర్‌ పేషెంట్లకు మంచి ఔషధంలా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ‘నైలిసిసిన్‌’ అనే రసాయనం షుగర్‌ను కంట్రోల్‌ చేస్తోంది.

* కీళ్ల నొప్పుల నివారణలోనూ లవంగాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే యాంటి ఇన్‌ఫ్లమెంటరీ గుణాలే దీనికి కారణమని చెబుతున్నారు.

* జలుబు, దగ్గు, గొంతు నొప్పి ఎడతెరపి లేకుండా ఉంటే లవంగంను నమలండి ఉపశమనం లభిస్తుంది. వీటిలో ఉండే యాంటీవైరల్‌, యాంటీ బ్యాక్టీరియల్‌ లక్షణాలు ఈ సమస్యలను నివారిస్తాయి.

Also Read: Anjeer Fruit Benefits: అంజీర పండ్లతో ఎన్ని ప్రయోజనాలో.. ముఖ్యంగా వారు ఈ పండ్లను తిన్నట్లయితే..

అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు పాదరక్షలు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్