Different Types of Cancers:శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు క్యాన్సర్ వచ్చే అవకాశం.. క్యాన్సర్ లోని ప్రధాన రకాలు ఎన్నో తెలుసా!
గుండెకు సంబంధించిన వ్యాధులైతే ఆ ఒక్క భాగానికే పరిమితమవుతుంది. కానీ క్యాన్సర్ వ్యాధి అలాకాదు.. మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ వ్యాధికి వయసుతో కానీ స్త్రీ,...
Different Types of Cancers: గుండెకు సంబంధించిన వ్యాధులైతే ఆ ఒక్క భాగానికే పరిమితమవుతుంది. కానీ క్యాన్సర్ వ్యాధి అలాకాదు.. మన శరీరంలోని దాదాపు అన్ని అవయవాలకు వచ్చే అవకాశం ఉంది. ఈ క్యాన్సర్ వ్యాధికి వయసుతో కానీ స్త్రీ, పురుషులనే బేధం లేదు.. అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారి లెక్కల ప్రకారం తల, మెడ క్యాన్సర్ రోగుల్లో 60 శాతం భారత దేశంలో ఉన్నారు. 2030 నాటికి ఈ సంఖ్య రెట్టింపు కానుంది. అయితే క్యాన్సర్ లో చాలా రకాలున్నాయి. సాధారణంగా ఎక్కువ మందిలో కనిపించే క్యాన్సర్ రకాలను ఇప్పుడు తెలుసుకుందాం..
1. తల, మెడ క్యాన్సర్
కణతిలా ఉండటం లేదా గొంతు పొక్కుకుపోవడం, మింగడంలో ఇబ్బంది, స్వరంలో మార్పు లేదా మొద్దుబారడం లాంటివి తల, మెడ క్యాన్సర్ లక్షణాలు. తీవ్రమైన పరిస్థితుల వల్ల కూడా ఇవి సంభవించవచ్చు. అందువల్ల ఈ లక్షణాల్లో దేనినైనా ఎదుర్కొంటున్నప్పుడు వైద్యుడి సంప్రదించాలి. . పొగాకు వినియోగం, ధూమపానం, పొగాకు నమలడం, మద్యపానం లాంటి దురలవాట్లు ఈ క్యాన్సర్లకు ప్రధాన కారణాలు. పొగాకు, ఆల్కహాల్ రెండింటిలో ఒక్కదాన్ని తీసుకునేవారి కంటే రెండూ తీసుకునేవారిలో క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా ఉంటుంది. తల, మెడ క్యాన్సర్లకు చికిత్స పొందిన రోగులకు నూతన క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకని తల మీద క్యాన్సర్ లక్షణాలున్నవారు తరచుగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి.
2. మూత్రాశయ క్యాన్సర్ :
ఈ రకమైన క్యాన్సర్ ఎక్కువగా వయసు పై బడిన వారికి సోకె అవకాశం ఉంది. ఆడవారి కన్నా మగవాళ్లలో ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ క్యాన్సర్ ను ప్రారంభ దశలోనే గుర్తుపట్టవచ్చు. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, మూత్రవిసర్జన లో ఇబ్బంది కలగటం, అలసట , బలహీనంగా ఉండటం, ఎముకల నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
3. బ్రెస్ట్ కాన్సర్ :
మహిళల్లో వచ్చే క్యాన్సర్ లో ఎక్కువ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇది స్కిన్ క్యాన్సర్ తర్వాత ఎక్కువగా వచ్చే క్యాన్సర్ . ఈ వ్యాధి స్త్రీ , పురుషులిద్దరికీ వచ్చే అవకాశాలున్నాయి కానీ ఎక్కువగా స్త్రీల్లోనే కనిపిస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో రొమ్ము లో గడ్డలు ఏర్పడటం, రొమ్ము చర్మం మసకబారటం , రొమ్ము పరిమాణం లో మార్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
4 పెద్దప్రేగు క్యాన్సర్ :
పెద్ద ప్రేగు లో అసాధారణంగా పెరిగిన కణితిలు పెద్ద ప్రేగు క్యాన్సర్ కి దారి తీస్తాయి. 50 సంవత్సరాలు దాటిన వారి కి ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకే 50 ఏళ్ళు దాటిన వారు హెల్త్ చెక్ అప్ తరచుగా చేయించుకోవాలి. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో మలబద్దకం, మలంలో రక్తం కనిపించటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
5. గర్భాశయ క్యాన్సర్ :
గర్భాశయ క్యాన్సర్ ఎండోమెట్రియం లో కణాలు అసాధారణంగా పెరగటం వళ్ళ వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, యోనీ డిశ్చార్జ్, మూత్ర విసర్జన లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.
6. కిడ్నీ క్యాన్సర్
కిడ్నీ క్యాన్సర్ వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరికీ సోకె అవకాశాలు ఉన్నాయి. అయితే ఎక్కువగా 40 సంవత్సరాలు పై బడిన వారికి ఎక్కువగా వస్తుంది. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, ఆకలి వేయకపోవడం, మూత్ర విసర్జన లో రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
7. కాలేయ క్యాన్సర్
లివర్ కాన్సర్ లో ముఖ్యంగా 2 రకాల క్యాన్సర్ చాలా ప్రమాదకరం, ఒకటి హెపాటోసెల్లర్ కార్సినోమా రెండు బైల్ డక్ట్ కాన్సర్. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, కడుపు నొప్పి, అలసటగా మరియు బలహీనంగా ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
8. ఊపిరితిత్తుల క్యాన్సర్
ఈ రకమైన క్యాన్సర్ లంగ్స్ అంటేనే శ్వాస కి సంబంధించినది, ఎక్కువగా ధుమపానం అలవాటున్నవారికి సోకుతుంది. దీనిలో కూడా రెండు రకాలు ఉంటాయి. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో బరువు తగ్గటం, ఆకలి వేయకపోవడం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది కలగటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
9. ప్రోస్టేట్ క్యాన్సర్
ప్రోస్టేట్ మన శరీరంలో ఒక రకంగా వీర్యం రవాణా కొరకు సహాయపడుతుంది. ఈ రకమైన క్యాన్సర్ చాలా నెమ్మదిగా వ్యాపిస్తుంది, ఈ క్యాన్సర్ వ్యాపించక ముందు గుర్తు పట్టినా చికిత్స ద్వారా తగ్గించుకోవడం అంత సులువు కాదు. ఈ క్యాన్సర్ వచ్చినవారిలో తరచుగా మూత్రం రావటం, మూత్రవిసర్జన సమయంలో నొప్పి కలగటం, మూత్రంలో లేదా వీర్యంలో రక్తం రావటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
10. థైరాయిడ్ క్యాన్సర్
థైరాయిడ్ ఉత్పత్తి చేసే హార్మోన్స్ గుండె స్పందన రేటును, శరీర ఉష్ణోగ్రత, రక్త పోటు ని నియంత్రిస్తుంది. ఈ థైరాయిడ్ క్యాన్సర్ బారిన పడినవారిలో మొదట్లో ఎలాంటి లక్షణాలు కనిపించవు కానీ క్రమ క్రమంగా గొంతు వాపుకు గురవుతుంది.
11. లుకేమియా
లుకేమియా రక్తానికి సంబంధించిన క్యాన్సర్, ఈ క్యాన్సర్ రక్తంలో తెల్ల రక్త కణాలు పెరిగితే వస్తుంది. ఈ క్యాన్సర్ ఎక్కువగా చిన్నపిల్లలకు వస్తుంది. ఈ క్యాన్సర్ లక్షణాలు జ్వరం రావటం, బరువు తగ్గటం, చర్మం పై ఎర్రటి మచ్చలు రావటం, ఎముకలలో నొప్పి
12. మెలనోమా
మెలనోమా అనేది చర్మానికి సంబంధించిన ప్రమాదకరమైన క్యాన్సర్. ఈ కాన్సర్ మెలనోసైట్స్ అనే కణాల నుంచి మొదలు అవుతుంది. ఈ క్యాన్సర్ యూవీ రేడియేషన్ తో వస్తుంది. ఈ క్యాన్సర్ చర్మం పై ఎక్కడైనా రావొచ్చు. ఈ క్యాన్సర్ వచ్చిన వారిలో శరీరం పై ముందు నుంచి ఉన్న మచ్చలలో తేడా కనిపిస్తుంది. చర్మం పై అసాధారణంగా మచ్చలు పెరగటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.
Also Read: