Wisconsin Mother Meets Baby: కోమాలోనే ప్రసవం.. మూణ్ణెళ్ళ తర్వాత కన్న కూతురిని చూసుకుని మురిసిపోయిన తల్లి.. అసలేమైందంటే?
కోవిడ్ బారిన పడిన ఓ గర్భవతి కోమాకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మూడునెలల అనంతరం కోలుకున్నఆ తల్లి తన బిడ్డను ఒడిలోకితీసుకుంది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్సిన్ లో చోటుచేసుకుంది..
Wisconsin Mother Meets Baby: ప్రపంచంలో అల్లకల్లోలం సృష్టించిన కరోనా ఎవరికీ ఎవరిని కాకుండా చేసింది. పేద చిన్నా, పేద ధనిక అనే తేడా లేకుండా అందరిపై తన ప్రభావం చూపించింది. అలా కోవిడ్ బారిన పడిన ఓ గర్భవతి కోమాకు వెళ్ళింది. ఆ సమయంలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. మూడునెలల అనంతరం కోలుకున్నఆ తల్లి తన బిడ్డను ఒడిలోకితీసుకుంది. హృదయాన్ని కదిలించే ఈ సంఘటన అమెరికాలోని విస్కాన్సిన్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకివెళ్తే..
విస్కాన్సిన్ కు చెందిన కెల్సీ టౌన్సెండ్ (32) ఏళ్ల మహిళ తన నాలుగవ బిడ్డకు జన్మనిచ్చింది. దాదాపు మూడు నెలల తరువాత ఆమె తన చిన్నారి కూతురుని కనులారా చూడగలిగింది. తన కూతురు లూసీ ని చూస్తూ నేన్ను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను.. నీ ప్రకాశవంతమైన మొహాన్ని చిరునవ్వును ఇప్పుడు నేను చూడగలుగుతున్నాను అంటూ ఆ తల్లి లూసీపై ప్రేమను వ్యక్త పరిచింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కెల్సీ టౌన్సెండ్ కు గత మూడు నెలల క్రితం కరోనా వైరస్ తో సోకడంతో మాడిసన్ లోని ఎస్ఎస్ఎమ్ హెల్త్ సెయింట్ మేరీస్ ఆస్పత్రిలో జాయిన్ అయ్యింది. ఆమె ఆస్పత్రిలో చేరిన కొద్దీ సేపటికె ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకింది. దీంతో ఆమెకు చికిత్సనందిస్తున్న వైద్యులు నవంబర్ 4 న సిజేరియన్ చేయడంతో శిశువుకు జన్మనిచ్చింది. అప్పటి నుంచిహ్ సుమారు ఆస్పత్రిలో కోమాలో 75 రోజులు ఉంది. చివరికి జనవరి 27న ఆమె కోమానుంచి బయటకు వచ్చి తన కుమార్తెను కలిసింది.
కోవిడ్ -19 తో బాధపడుతూ ఓ తల్లి శిశువును ప్రసవించడం చాలా అరుదని డైరెక్టర్ డాక్టర్ జెన్నిఫర్ చెప్పారు. ఆమె ఆస్పత్రిలో చేరిన సమయంలో ఆక్సిజన్ తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉందని.. చెప్పారు.. అలా తల్లి ఆక్సిజన్ తక్కువగా తీసుకోవడంతో పిండం మెదడు, ఇతర అవయవాలపై ప్రభావం చూపించి.. శిశువు చర్మం నీలం రంగులోకి మారినట్లు డాక్టర్ థామస్ లిటిల్ఫీల్డ్ తెలిపారు. దీంతో తల్లి నుంచి బిడ్డను వీలైనంత త్వరగా వేరుచేయాలని భావించి నవంబర్ 4 న ఆపరేషన్ చేసి శిశువుని బయటకు తీశామని తెలిపారు.
ఇక తల్లి కెల్సీ టౌన్సెండ్ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీరణించడంతో చివరకుడిసెంబర్ నెలాఖరున ఊపిరితిత్తుల మార్పిడి అవసరమని వైద్యులు భావించారు. అయితే హఠాత్తుగా వైద్యులకు షాక్ ఇస్తూ కెల్సీ టౌన్సెండ్ ఆరోగ్యం మెరుగుపడడం మొదలైంది. రోజు రోజుకీ ఆరోగ్యం మేరుపడడంతో ఆమెను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ నుండి తరలించారు. జనవరి మధ్యలో వెంటిలేటర్ ను తొలగించారు.
ఆ మూడు నెలలు గడిపిన సమయాన్ని అప్పటి అనుభవం పై టౌన్సెండ్ భర్త డెరెక్ టౌన్సెండ్ స్పందించారు. అప్పుడు తాను అనుభవించిన బాధను “పెద్ద రోలర్ కోస్టర్” గా అభివర్ణించారు. ఈ మూడునెలలు నిద్ర లేని రాత్రులు గడిపానని.. ఎవరైనా తనకు ఫోన్ చేస్తే భయమేసేదని అప్పుడు తాను పడిన బాధను గుర్తు చేసుకున్నారు. అయితే కెల్సి కి చికిత్స విషయం లో వైద్యులు చాలా కష్టపడ్డారని .. తాము చేయగలిగినదంతా చేస్తున్నామని.. ఏ సమయంలో ఏ వార్త వినాల్సి వచ్చినా రెడీ గా ఉండాలని డాక్టర్లు చెప్పారు. అయితే ఆమెను తాను మళ్ళీ తిరిగి ప్రాణాలతో చూస్తానని అనుకోలేదని ఉద్వేగ భరితంగా చెప్పాడు భర్త.. అయితే తన కుమార్తె లూసీ ని తల్లి దగ్గరకు ఎప్పుడు తీసుకెళ్లినా .. తన తల్లిని ప్రేమగా చూసేదని అన్నాడు.. ఈరోజు తన కూతురు ప్రేమే తన భార్య కెల్సి ని తిరిగి ట్యాంకు ఇచ్చిందని తెలిపాడు.
తాము ఇద్దరం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వైరాస్ సెకండ్ కాంటాక్ట్ ద్వారా వచ్చిందని.. అయితే తాను త్వరగా కోలుకున్నానని .. గర్భవతి అయిన తన భార్య ఆరోగ్య పరిస్థితి ఆస్పత్రికి తీసుకుని వెళ్లే సమయానికే విషమించిందని తెలిపారు. ఈ విషయం పై భార్య కెల్సీ టౌన్సెండ్ స్పందిస్తూ నాకు నాకుటుంబమే సర్వస్వం.. తాను మళ్ళీ తన ఇంటికి సంపూర్ణ ఆరోగ్యంతో వచ్చానని.. ప్రతి క్షణం తన కుటుంబంతోనే గడుపుతానను అంది.
Also Read: