Corona virus Update: తెలంగాణలో కొత్తగా169 కరోనా కేసులు.. 24 గంటల వ్యవధిలో ఎంతమంది కోలుకున్నారంటే..
Corona virus: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 169 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరింది.
Corona virus: తెలంగాణలో 24 గంటల వ్యవధిలో కొత్తగా 169 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,270కి చేరింది. నిన్న కొవిడ్ కారణంగా ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 1,607కి పెరిగింది. కాగా… 24 గంటల వ్యవధిలో 189 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్యమంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 2,91,699కి చేరింది. తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,964 కాగా, వారిలో 780 హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 80,34,038గా నమోదైంది.