కేరళలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ఫ్లాన్.. కాషాయం కండువా కప్పుకున్న మాజీ డీజీపీ జాకబ్ థామస్

కేరళ రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ద‌ృష్టి పెట్టిన బీజేపీ.. ముఖ్యనేతలందరినీ పార్టీలో చేర్చుకునే పనిలోపడింది.

కేరళలో పాగా వేసేందుకు బీజేపీ అధిష్టానం ఫ్లాన్.. కాషాయం కండువా కప్పుకున్న మాజీ డీజీపీ జాకబ్ థామస్
Follow us
Balaraju Goud

|

Updated on: Feb 05, 2021 | 3:46 PM

Kerala Former DGP Joins BJP : కేరళలో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఫోకస్ చేసింది. ఆ రాష్ట్రంలో సంస్థాగతంగా పార్టీ బలోపేతంపై ద‌ృష్టి పెట్టిన బీజేపీ… ముఖ్యనేతలందరినీ పార్టీలో చేర్చుకునే పనిలోపడింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికీ పార్టీ క్యాడర్‌ను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఆ రాష్ట్ర మాజీ పోలీసు డైరెక్టరు జనరల్ జాకబ్ థామస్ భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా కేరళ పర్యటనలో భాగంగా థామస్ బీజేపీ కండువా కప్పుకున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు టెక్కిన్ కడ్ మైదానంలో జరిగిన బహిరంగ సభలో మాజీ డీజీపీ జాకబ్‌కు బీజేపీ సభ్యత్వం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేరళ రాష్ట్రంలో అధికారంలో ఉన్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీలు అవినీతిలో కూరుకుపోయాయని మాజీ డీజీపీ జాకబ్ థామస్ ఆరోపించారు. తాను అవినీతికి వ్యతిరేకంగా పోరాటం సాగించేందుకు బీజేపీలో చేరానని జాకబ్ చెప్పారు.

కేరళ అసెంబ్లీ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు బీజేపీ అధినేత జేపీ నడ్డా రెండు రోజుల పర్యటన కోసం కొచ్చికి వచ్చారు. కొచ్చి విమానాశ్రయం నుంచి నడ్డా ఓపెన్ టాప్ జీపులో వందలాది మంది బీజేపీ కార్యకర్తలు వెంటరాగా త్రిస్సూర్ వరకు ర్యాలీగా వెళ్లారు. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎన్నికలకు సమాయత్తమవుతున్న నేపథ్యంలో మాజీ డీజీపీ బీజేపీ తీర్థం స్వీకరించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇక, త్వరలో మరికొందరు ముఖ్యనేతలు బీజేపీలో చేరనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Read Also…  ఆ గ్రామస్తులు అన్నంత పని చేశారు.. ఒక్కతాటిపై నిలబడ్డారు.. ఏకంగా ఎన్నికలను వాయిదా వేసే పరిస్థితి తెచ్చారు.. అసలేం జరిగింది..!