రేపు ప్రతిపక్షాల భేటీ……ప్రధాన పార్టీలకు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఆహ్వానాలు ..అప్పుడే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు ?

దేశంలో జాతీయ స్థాయిలో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

రేపు ప్రతిపక్షాల భేటీ......ప్రధాన పార్టీలకు శరద్ పవార్, యశ్వంత్ సిన్హా ఆహ్వానాలు ..అప్పుడే థర్డ్ ఫ్రంట్ ఏర్పాటుకు సన్నాహాలు ?
Sharad Pawar Calls Oppositi
Follow us
Umakanth Rao

| Edited By: Phani CH

Updated on: Jun 21, 2021 | 5:22 PM

దేశంలో జాతీయ స్థాయిలో పెను రాజకీయ పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలన్న యోచన దిశగా విపక్షాలు గట్టిగా ముందుకు వెళ్లే అవకాశాలు స్పష్టమవుతున్నాయి. సోమవారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో భేటీ అయిన అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ రేపు ప్రతిపక్షాలతో సమావేశం కానున్నారు. ఆయన తరఫున, తృణమూల్ కాంగ్రెస్ నేత, బీజేపీ మాజీ నేత యశ్వంత్ సిన్హా తరఫున ప్రధాన విపక్షాలకు ఆహ్వానాలు పంపారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీలను ఎదుర్కోవడానికి గల అవకాశాలపై చర్చించేందుకు ఈ మీటింగ్ నిర్వహించనున్నట్టు తెలుస్తోంది. దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిణామాలపై జరగనున్న చర్చకు ఈ నాయకులిద్దరూ నేతృత్వం వహిస్తారని సమాచారం. సిన్హా ఆధ్వర్యంలోని రాష్ట్ర మంచ్ తరఫున ఈ ఇన్విటేషన్లను పంపారు. ఉదయం ప్రశాంత్ కిషోర్, పవార్ మధ్య జరిగిన చర్చల్లో 2024 లో జరిగే లోక్ సభ ఎన్నికలే ప్రధాన అజెండా అని తెలిసింది. మోదీపై పోటీకి ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థిని నిలబెట్టాలన్న విషయంపై వారు చర్చించారని తెలుస్తోంది. ఇదే సమయంలో పలు విపక్షాలు కూడా ఈ విధమైన ‘గ్రూపింగ్’ లో తాము కూడా పాల్గొంటామని సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు.

దేశంలో అత్యంత సీనియర్ నేతల్లో ఒకరైన శరద్ పవార్..కొన్నేళ్లలో పలు సంకీర్ణ ప్రభుత్వాలకు, ఫ్రంట్లకు రూపునిచ్చారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమినే మొదట ప్రాతిపదికగా తీసుకోవాలని ఈ నేతలు భావిస్తున్నట్టు తెలిసింది. ఇదే సరళిని రానున్న ఎన్నికల్లో కూడా అనుసరిస్తే తగిన ఫలితాలు రాగలవన్నది విపక్షాల ఆశాభావంగా ఉన్నట్టు తెలిసింది. జాతీయ స్థాయిలో విపక్షాల కూటమి ఏర్పడడం ఎంతైనా అవసరమని శివసేన నేత సంజయ్ రౌత్ ఇటీవల వ్యాఖ్యానించారు. దీనిపై పవార్ తో తాను మాట్లాడినట్టు కూడా ఆయన తెలిపారు. 2024 ఎన్నికల్లో ప్రతిపక్షాలన్నీ కలిసికట్టుగా పోటీ చేయాలనీ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా వ్యాఖ్యానించారు. మీరు ప్రధాన మంత్రి అభ్యర్థి అవుతారా అన్న ప్రశ్నకు ఆమె… మొదట ఈ కోవిద్ పరిస్థితి అదుపులోకి రానివ్వండి అని పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Tadepalli Gang Rape: తాడేపల్లి అత్యాచార బాధితురాలిని పరామర్శించిన మంత్రులు సుచరిత, వనిత.. రూ. 50 వేల సాయం అందజేత..

Oil Seed Rates: దేశంలో పెరుగుతున్న నూనె గింజల ధరలు..తగ్గిన ఆవపిండి డిమాండ్