వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. వృద్దుడికి రెండు వేర్వేరు టీకా డోసులు.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.?

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ వృద్ధుడికి రెండు వేరు వేరు రకాల టీకాలను వేసారు వైద్య సిబ్బంది. అందులో మొదటిది కోవాక్సిన్, రెండవది కోవిషీల్డ్.

వైద్య సిబ్బంది నిర్లక్ష్యం.. వృద్దుడికి రెండు వేర్వేరు టీకా డోసులు.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే.?
Corona Vaccine
Rajitha Chanti

|

May 13, 2021 | 1:34 PM

మహారాష్ట్రలోని జల్నా జిల్లాలో ఓ వృద్ధుడికి రెండు వేరు వేరు రకాల టీకాలను వేసారు వైద్య సిబ్బంది. అందులో మొదటిది కోవాక్సిన్, రెండవది కోవిషీల్డ్. అయితే రెండవ డోసు తీసుకున్న తర్వాత అతను కొన్ని ఆరోగ్యం సమస్యలు ఎదుర్కోన్నాడు అని అతని కుటుంబసభ్యులు వాపోయారు. ఈ సంఘటన ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే సొంత జిల్లాలో జరగడంతో స్థానిక అధికారుల పై నిప్పులు చెరిగారు. జల్నా జిల్లాలోని పార్టూర్ తాలూకాలోని ఖాండ్వి గ్రామానికి చెందిన దత్తాత్రయ వాగ్మారే (72) మార్చి 22 న పార్టూర్ లోని ఒక గ్రామీణ ఆసుపత్రిలో కోవాక్సిన్ మొదటి డోసు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏప్రిల్ 30 న, శ్రీష్టి గ్రామంలోని ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిషీల్డ్ టీకా రెండవ డోసు తీసుకున్నాడు. రెండవ డోసు తీసుకున్న తర్వాత అతనికి జ్వరంతోపాటు ఆందోళన, శరీరంపై దద్దుర్లు వచ్చాయని అతని కుమారుడు దిగంబర్ చెప్పారు.

ఈ విషయం తెలుసుకున్న ఔరంగాబాద్ ఆరోగ్య డిప్యూటీ డైరెక్టర్ ఈ సంఘటన పై విచారణకు ఆదేశించారు. ఈ ఘటన అక్కడి స్థానిక అధికారుల వివరణ కోరామని… అలాగే టీకా తీసుకున్న వ్యక్తి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. మరాఠ్వాడ అభివృద్ధి బోర్డు సభ్యుడు (ఆరోగ్యం) అశోక్ బెల్ఖోడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో టీకాలు వేయడంపై ప్రాథమిక అవగాహన లేదని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అక్కడి స్థానిక అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. మొదటి డోసు..రెండవ డోసుకు మధ్య ఉండాల్సిన నిర్ణిత విరామ సమయం గురించి గ్రామీణ ప్రజలకు పెద్దగా తెలియదని.. ప్రతి లబ్ధిదారుడికి డేటా బేస్ అందించాలని తెలిపారు.

ఇక ఈ ఘటనపై డాక్టర్ కిశోర్ మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరగడం మాములే అని చెప్పారు. టీకా మొదటి డోసు తీసుకునే వ్యక్తికి కనీస బాధ్యతగా ఏ వ్యా్క్సిన్ తీసుకునేది గుర్తుపెట్టుకోవాలన్నారు. మొదటి డోసు ఏది అనేది చెప్పలేకపోతే వారికి అందుబాటులో ఉన్న వ్యాక్సినేషన్ సెంటర్ కు వెళ్ళాలని స్పష్టం చేసారు. అయితే నిర్ణీత సమయంలో రెండు వేరు వేరు టీకాలు తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు రావని స్పష్టం చేశారు.

వీడియో..

Also Read: ప్యాన్ ఇండియా మూవీస్‌పై మనసు పారేసుకున్న ఎన్టీఆర్… వరుసగా స్టార్ డైరెక్టర్స్‌కు గ్రీన్ సిగ్నల్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu