రాజౌరీలో ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉగ్రస్థావరాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా రాజౌరీ జిల్లాలోని తన్మండి ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ, 38 బెటాలియన్‌కు చెందిన..

రాజౌరీలో ఉగ్రస్థావరం గుట్టురట్టు.. భారీగా ఆయుధాలు స్వాధీనం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 22, 2020 | 6:14 PM

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతోంది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున ఉగ్రస్థావరాలు కూడా బయటపడుతున్నాయి. తాజాగా రాజౌరీ జిల్లాలోని తన్మండి ప్రాంతంలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ, 38 బెటాలియన్‌కు చెందిన రాష్ట్రీయ రైఫిల్స్‌ సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం అందడంతో ఈ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అయితే ఈ క్రమంలో ఓ భారీ ఉగ్రస్థావరాన్ని గుర్తించారు. దీంతో అక్కడ తనిఖీలు చేపట్టగా.. ఓ చైనీస్ తుపాకీతో పాటు.. పికా గన్,168 రౌండ్ల పికా బుల్లెట్లు, ఏకే-47 గన్స్, అండర్ బారెల్ గ్రేనేడ్ లాంచర్లు, ఇతర ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుంటే.. సోమవారం నాడు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ముగ్గురు ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయగా.. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.