AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడు.. నేడు ఆస్తులమ్ముకునే స్టేజ్, అమెజాన్ ను అలెగ్జాండర్‌ తో పోల్చిన కిషోర్

ఆయన ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఫ్యూచర్ గ్రూప్ ఎండిగా బిగ్ బజార్ సంస్థల అధిపతిగా అందరికీ తెలిసిన ఓ గొప్ప వ్యాపారవేత్త. అయితే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదుగా ఆయనకు

ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడు.. నేడు ఆస్తులమ్ముకునే స్టేజ్, అమెజాన్ ను అలెగ్జాండర్‌ తో పోల్చిన కిషోర్
Surya Kala
|

Updated on: Feb 04, 2021 | 10:43 AM

Share

Future Group CEO Kishore Biyani : బండ్లు ఓడలవుతాయి .. ఓడలు బండ్లు అవుతాయి.. ఎవరు ఎప్పుడు ఏ స్టేజ్ లో ఉంటారో కాలానికే తెలియదు అని పెద్దలు చెప్పిన మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నేడు ఒక వ్యక్తి నిలుస్తున్నారు. ఆయన ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుల్లో ఒకరు. ఫ్యూచర్ గ్రూప్ ఎండిగా బిగ్ బజార్ సంస్థల అధిపతిగా అందరికీ తెలిసిన ఓ గొప్ప వ్యాపారవేత్త. అయితే కాలం ఎప్పుడూ ఒకలా ఉండదుగా ఆయనకు అనుకోకుండా కష్టాలు మొదలయ్యాయి. ఆస్తులు కరిగిపోతున్నాయి. కంపెనీలు పోయాయి. కనీసం ట్రేడింగ్ చేయడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. కంపెనీ అమ్మాల్సి వచ్చింది. అయినా కష్టాలు తీరలేదు. ఇదే సమయంలో గోరు చుట్టుపై రోకటి పోటులా తాజాగా సెబీ కూడా నిషేధం విధించింది. ఇన్ని సమస్యలు కిషోర్ బియానీని ఒక్కసారే చుట్టుముట్టాయి.

మరోవైపు ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ డీల్ 3.4 బిలియన్ డాలర్ల ఒప్పందంపై అమెరికా కంపెనీ అమెజాన్ పోరాటం చేస్తోంది. ఫ్యూచ‌ర్ గ్రూప్ చైర్యన్, సిఇఓ కిషోర్ బియానీ దీనిని సీరియస్ గా తీసుకోగా.. ఆ రెండు గ్రూపుల ఒప్పందానికి వ్యతిరేకంగా అమెజాన్ కోర్టుకు ఎక్కింది. అంతేకాదు ఈ ప్రయత్నాలను విరమించుకోమని అది మీకే మంచిదంటూ కిషోర్ బియానీ కి హితవు పలికింది. ఈ ఒప్పందాన్ని అడ్డుకోవడానికి అమెజాన్ చేస్తున్న ప్రయత్నాలను ఎద్దేవా చేస్తూ… భారత్ దేశ చరిత్రను తెలుసుకుంటే మంచిదన్నారు కిషోర్‌ బియానీ

అలెగ్జాండ‌ర్ క‌థ‌ను ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు బియానీ.. ఈ భూమిని ఆక్రమించాలన్న అలెగ్జాండర్ ది గ్రేట్ క్రూరమైన కోరికలాంటిదే అమెజాన్‌ ప్రయస అని అభివర్ణించారు. ప్రపంచంలో చాలా భాగాన్ని జయించిన గ్రీకు వీరుడు ఇండియాలో తోక ముడిచాడనేది చరిత్ర చెబుతోందని వ్యంగ‍్యంగా వ్యాఖ్యానించారు. ప్రపంచాన్ని జ‌యించి భార‌త్ కు వ‌చ్చి ఓడిపోయాడ‌ని, అదే గ‌తి అమెజాన్ కు ప‌డుతుంద‌ని హెచ్చరించారు. ఈ ప్రాంతాన్ని మార్కెట్ ప‌రంగా త‌మ గుప్పిట్లోకి తీసుకోవాల‌ని అమెజాన్ భావిస్తే అది అత్యాశవుతుందని వాఖ్యానించారు.

ఆర్‌ఐఎల్‌‌కు రిటైల్‌ ఆస్తుల విక్రయం నిబంధనలకు విరుద్ధమని వాదిస్తున్న అమెరికా ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం అమెజాన్‌, ఫ్యూచర్‌ గ్రూప్ సీఈఓ కిషోర్‌ బియానీసహా వ్యవస్థాపకులందరినీ అరెస్ట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.

ఈ నేపథ్యంలోనే బియానీ తాజా వ్యాఖ‍్యలు చేశారు. రిల‌య‌న్స్ రీటైల్ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధ‌న‌లు పాటించామ‌న్నారు. అంతేకాదు ఇండియ‌న్ వినియోగదారులపై ఆధిప‌త్యం కోసం అమెజాన్ చేస్తున్న కార్పొరేట్ యుద్ధంగా అభివ‌ర్ణించారు. ఈ మేరకు ఆయన ఉద్యోగులకు ఒక అంతర‍్గత లేఖ రాశారు. రిలయన్స్‌ రీటైల్‌ ఒప్పందానికి సంబంధించి అన్ని నిబంధనలను పాటించామని, రెగ్యులేటరీ ఇటీవలి ఆమోదమే ఇందుకు నిదర్శనమన్నారు. 1,700 దుకాణాలు, వేలాది మంది ఉద్యోగుల మనుగడకు ఈ ఒప్పందం కీలకమని తెలిపారు. అమెజాన్ ప‌నిగ‌ట్టుకుని భార‌తీయ కంపెనీల‌ను నామ రూపాలు లేకుండా చేయాల‌ని అనుకుంటోంద‌ని బియానీ ఆరోపించారు. అమెజాన్ తన కుత్సిత ప్రయ‌త్నాల‌ను విర‌మించు కోవాల‌ని, ఆ విష‌యం కోర్టు ప‌రిధిలో ఉంద‌ని దాని గురించి తాను ఏమీ మాట్లాడ‌న‌ని అన్నారు కిషోర్ బియానీ. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి అమెజాన్‌ నిరాకరించింది.

Also Read:

మరో కొత్త ప్లాన్‌తో వచ్చిన బీఎస్‌ఎన్‌ల్‌.. ఓటీటీల కోసం ప్రత్యేక రీచార్జ్‌ ఆఫర్‌ ప్రకటించిన ప్రభుత్వ రంగ సంస్థ..

గూగుల్‌ వ్యతికేరిస్తున్న చట్టానికి మద్ధతు పలికిన మైక్రోసాఫ్ట్‌.. ఆస్ట్రేలియాలో ఇకపై ఆ సెర్జ్‌ ఇంజన్‌ ఉండదా..?