Microsoft: గూగుల్‌ వ్యతికేరిస్తున్న చట్టానికి మద్ధతు పలికిన మైక్రోసాఫ్ట్‌.. ఆస్ట్రేలియాలో ఇకపై ఆ సెర్జ్‌ ఇంజన్‌ ఉండదా..?

Microsoft Support Australian Government: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు గతకొన్ని రోజులుగా వాగ్వాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలను వినియోగించుకుంటున్నందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌లు..

Microsoft: గూగుల్‌ వ్యతికేరిస్తున్న చట్టానికి మద్ధతు పలికిన మైక్రోసాఫ్ట్‌.. ఆస్ట్రేలియాలో ఇకపై ఆ సెర్జ్‌ ఇంజన్‌ ఉండదా..?
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 04, 2021 | 5:48 AM

Microsoft Support Australian Government: ఆస్ట్రేలియా ప్రభుత్వానికి ప్రముఖ సెర్చ్‌ ఇంజిన్‌ గూగుల్‌కు గతకొన్ని రోజులుగా వాగ్వాదం నడుస్తోన్న విషయం తెలిసిందే. మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలను వినియోగించుకుంటున్నందుకు ఫేస్‌బుక్‌, గూగుల్‌లు ఆయా వార్తా సంస్థలకు కొంత మొత్తం చెల్లించాలంటూ ఆస్ట్రేలియా కొత్త చట్టం రూపొందించింది. అయితే ఈ నిర్ణయాన్ని గూగుల్‌ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. ఇది ఆచరణ సాధ్యం కాదని చెబుతున్న గూగుల్‌.. ఈ విధానం తప్పనిసరి అయితే ఆస్ట్రేలియాలో తమ సేవలను నిలిపివేస్తామని కూడా హెచ్చరించింది. ఇలా గూగుల్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా ప్రభుత్వం అన్నట్లు సాగుతోన్న ఈ వార్‌లోకి ఇప్పుడు మరో టెక్‌ దగ్గజం మైక్రోసాఫ్ట్‌ వచ్చి చేరింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం రూపొందించిన కొత్త చట్టానికి మేము సమర్థిస్తున్నామంటూ మైక్రోసాఫ్ట్‌ ప్రకటించింది. దీంతో ఇప్పుడు మైక్రోసాఫ్ట్‌ సెర్చ్‌ ఇంజన్‌ ‘బింగ్‌’ తెరపైకి వచ్చింది. మరి గూగుల్‌ ఆస్ట్రేలియా నుంచి వైదొలుగుతుందా.. ఆ స్థానాన్ని బింగ్‌ భర్తీ చేస్తుందా అన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా ప్రధాని ఇటవీల కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌ స్థానాన్ని భర్తీ చేసే శక్తి తమకు ఉందని మైక్రోసాఫ్ట్‌ అధినేత సత్యా నాదెళ్ల తనతో తెలిపారని ఆస్ట్రేలియా ప్రధాని చెప్పడం సంచలనానికి దారి తీసింది. ఆస్ట్రేలియా తీసుకొచ్చిన కొత్త చట్టంపై మైక్రోసాఫ్ట్‌ స్పందిస్తూ.. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశిస్తే ఈ చట్టానికి తాము బద్ధులమై ఉంటామని పేర్కొనడం విశేషం. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.

Also Read: యూట్యూబ్ అభిమానులకు గుడ్ న్యూస్.. త్వరలో కొత్త ఫీచర్ అందుబాటులోకి.. ప్రత్యేకతలేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..