Instagram: యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. డిలీట్‌ చేసిన ఫొటోలను..

Instagram Brings New Feature For Users: సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌ హవా కొనసాగుతోన్న సమయంలో దానికి ప్రత్యామ్నయంగా వచ్చిందే ఇన్‌స్టాగ్రామ్‌. యువతను లక్ష్యంగా చేసుకొని వచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను పెద్ద ఎత్తున ఆకర్షించింది...

Instagram: యూజర్ల కోసం సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌.. డిలీట్‌ చేసిన ఫొటోలను..
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 04, 2021 | 5:48 AM

Instagram Brings New Feature For Users: సోషల్‌ మీడియాలో ఫేస్‌బుక్‌ హవా కొనసాగుతోన్న సమయంలో దానికి ప్రత్యామ్నయంగా వచ్చిందే ఇన్‌స్టాగ్రామ్‌. యువతను లక్ష్యంగా చేసుకొని వచ్చిన ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లను పెద్ద ఎత్తున ఆకర్షించింది. ఇక అనంతరం జరిగిన పరిణామాల తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌ను వాట్సాప్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటుంది కాబట్టే ఇన్‌స్టాగ్రామ్‌కు అంతలా క్రేజ్‌ ఉంది. ఫిల్టర్లు, ఇన్‌స్టా రీల్‌ పేరుతో రకరకలా ఫీచర్లను తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ‘రీసెంట్‌ డిలీటెడ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌ ద్వారా డిలీట్‌ చేసిన ఫొటోలు, వీడియోలను తిరిగి పొందవచ్చు. డేటా డిలీట్‌ చేయగానే రీసెంట్లీ డిలీటెడ్‌ అనే ఫోల్డర్‌లోకి సదరు డేటా వెళ్తుంది. రీసెంట్‌ డిలీటెడ్‌ ఫోల్డర్‌లోకి వెళ్లి డిలీట్‌ చేసిన ఫొటోలను పొందొచ్చు. మీరు డిలీట్‌ చేసిన ఫొటోలు నెల రోజుల పాటు ఆ ఫోల్డర్‌లో ఉంటాయి. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్‌ టెస్టింగ్‌ దశలో ఉంది. మరికొన్ని రోజుల్లోనే యూజర్లకు దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు.

Also Read: Samsung Budget Phone: శామ్‌సంగ్ నుంచి మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌.. ధర ఎంతో తెలుసా? ఫీచర్లు ఇలా ఉన్నాయి..